AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Home Tour: అతిలోక సుందరి నడయాడిన ఇంధ్రభవనాన్ని చూశారా.? శ్రీదేవీ హోమ్‌ టూర్‌ వీడియో..

అలనాటి అందాల తార శ్రీదేవీ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టి యావత్‌ దేశం గర్వించే నటిగా పేరు తెచ్చుకున్నారు శ్రీదేవీ. అతిలోక సుందరిగా అభిమాన హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన అందం, అభినయంతో ఎన్నో అవార్డులను దక్కించుకున్న..

Sridevi Home Tour: అతిలోక సుందరి నడయాడిన ఇంధ్రభవనాన్ని చూశారా.? శ్రీదేవీ హోమ్‌ టూర్‌ వీడియో..
Sridevi Home Tour Video
Narender Vaitla
|

Updated on: Nov 17, 2022 | 5:37 PM

Share

అలనాటి అందాల తార శ్రీదేవీ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టి యావత్‌ దేశం గర్వించే నటిగా పేరు తెచ్చుకున్నారు శ్రీదేవీ. అతిలోక సుందరిగా అభిమాన హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన అందం, అభినయంతో ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఈ అందాల తార ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇక 54 ఏళ్ల వయసులో శ్రీదేవీ ఆకస్మిక మరణం పొందిన విషయం తెలిసిందే. శ్రీదేవీ మరణించి ఇప్పటికీ నాలుగేళ్లు దగ్గపడుతోన్నా ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది.

తెలుగుతో పాటు దాదాపు అన్ని ఇండియన్‌ భాషల్లో అలరించిన శ్రీదేవీ చెన్నైలో మొట్టమొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసింది. తన కష్టార్జీతంతో నిర్మించుకున్న ఈ ఇళ్లు అంటే శ్రీదేవీకి ఎంతో ఇష్టం. ముంబైలో స్థిరపడిన తర్వాత కూడా శ్రీదేవీ పలుసార్లు ఈ విషయాన్ని తెలిపారు. చెన్నైలో ఉన్న ఇంటికి సంబంధించి తాజాగా శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హోమ్‌ టూర్‌ను నిర్వహించింది. తల్లి ఎంతో ఇష్టపడి కట్టుకున్న చెన్నై ఇంటి వివరాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా జాన్వీ పలు ఆసక్తికర విషయాలపు పంచుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా శ్రీదేవీ, బోణీకపూర్‌ల పెళ్లి ఫొటోను చూపించిన జాన్వీ.. ‘వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అందుకే ఈ ఫోటోల్లో ఇద్దరూ ఒత్తిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు’ అని చమత్కరించింది. అంతేకాకుండా తన బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌ రూమ్‌కి గడియ లేదని చెప్పిన జాన్వీ. అందుకు గల కారణాన్ని ఇలా చెప్పుకొచ్చింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్‌లో మాట్లాడుతానేమోనని అమ్మ ఆ డోర్‌కు గడియ పెట్టించలేదని తెలిపింది. ఇంటికి ఎన్ని మార్పులు చేసినా ఆ గడియా మాత్రం బిగించలేదంటూ చెప్పుకొచ్చింది. శ్రీదేవీ ఇంటికి సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..