Upasana Konidela: మెగా కోడలా మజాకా.. టాప్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోన్న ఉపాసన..
Upasana Kamineni: ఉపాసన.. ఈ పేరును తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా మహిళా వ్యాపారవేత్తగా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉపాసన ప్రస్తుతం అపోలో లైఫ్‌కు చైర్‌పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గాను సేవలందిస్తున్నారు..
ఉపాసన.. ఈ పేరును తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్ భార్యగానే కాకుండా మహిళా వ్యాపారవేత్తగా జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉపాసన ప్రస్తుతం అపోలో లైఫ్‌కు చైర్‌పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గాను సేవలందిస్తున్నారు. ఇక వృత్తిలో ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు ఉపాసన. జంతుప్రేమికురాలైన ఉపాసన వాటి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఉపాసన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు.
తన వృత్తిపరమైన అంశాలతో పాటు, భర్త రామచరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇలా మెగా ఫ్యాన్స్‌కు సైతం ఉపాసన దగ్గరయ్యారు. ఉపాసన పంచుకునే చెర్రీతో గడిపే సంతోష క్షణాలకు సంబంధించిన ఫొటోల కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఉపాసన ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసనకు ఏకంగా 6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 60 లక్షల మంది ఉపాసనను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపాసన ఇప్పటి వరకు కేవలం 1058 పోస్టులు మాత్రమే చేయడం గమనార్హం. అత్యంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకొని అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. ఉపాసనను 60 లక్షల మంది ఫాలో అవుతుంటే తను మాత్రం కేవలం 358 మందినే ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను ప్రస్తుతం ఇన్‌స్టాలో 9.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇలా మెగా కోడలు అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..