Allu Aravind: కథలో దమ్ముంటే ఏ సినిమానైనా చూస్తారు… ఇప్పుడు మూవీస్ కు భాషా బేధం లేదంటున్న అల్లు అరవింద్

2023 సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమాల రిలీజ్ కు ప్రధమ ప్రాధాన్యత అంటూ తెలుగు సినిమా నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై కోలీవుడ్ దర్శకుడు స్పందించారు.. తమ రాష్ట్రంలో కూడా తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి డబ్బింగ్‌ సినిమాలు విడుదలపై మరోసారి తమ వైఖరిని స్పష్టం చేసింది తెలుగు సినిమా నిర్మాతల మండలి.

Allu Aravind: కథలో దమ్ముంటే ఏ సినిమానైనా చూస్తారు... ఇప్పుడు మూవీస్ కు భాషా బేధం లేదంటున్న అల్లు అరవింద్
Allu Aravind
Follow us

|

Updated on: Nov 19, 2022 | 3:20 PM

ఓ వైపు దక్షిణాది సినిమాలు ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ఆదరణనను సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ , పుష్ప, కార్తికేయ 2 వంటి సినిమాలు ఉత్తరాదివారి ఆదరాభిమానులు  సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే దక్షిణాదిలో మాత్రం ప్రస్తుతం ప్రాంతీయవాద సినిమాలు అంటూ వివాదం నెలకొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ సినీ పరిశ్రమకు పెద్ద పండగ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమాల రిలీజ్ కు ప్రధమ ప్రాధాన్యత అంటూ తెలుగు సినిమా నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై కోలీవుడ్ దర్శకుడు స్పందించారు.. తమ రాష్ట్రంలో కూడా తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి  డబ్బింగ్‌ సినిమాలు విడుదలపై మరోసారి తమ వైఖరిని స్పష్టం చేసింది తెలుగు సినిమా నిర్మాతల మండలి.

సంక్రాంతి, దసరా పండుగలకు తెలుగు సినిమాలు మాత్రమే విడుదల చేయాలనేది మా డిమాండ్‌ కాదని స్పష్టం చేసిన నిర్మాతల మండలి.. తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇచ్చి.. తరువాత డబ్బింగ్‌ సినిమాలకు ఇవ్వాలనేది తమ అభిప్రాయని తెలిపింది. అంతేకాదు 2017లో తెలుగు సినిమాలను మాత్రమే విడుదల చేయాలని, డబ్బింగ్‌ సినిమాలు వద్దని చేసిన తీర్మానం చెల్లుబాటులో లేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇదే అంశంపై ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు. డబ్బింగ్‌ సినిమాల విడుదల అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. ఏ సినిమాలో దమ్ముంటే..ఆ భాష, ఈ భాష అన్న భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని  అల్లు అరవింద్ చెప్పారు. మంచి సినిమాలను ఎవరైనా ఆదిరిస్తారు.. నార్త్‌, సౌత్‌ అనే తేడా ఇప్పుడు లేదన్నారు అల్లు అరవింద్‌.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..