AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: చిక్కుల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌.. జరిమానాతో పాటు నోటీసులు జారీచేసిన గోవా సర్కారు.. ఎందుకంటే?

యువరాజ్ సింగ్ కు గోవాలోని మోర్జిమ్ లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. కాసా సింగ్ పేరుతో ఉన్న ఈ లగ్జరీ విల్లాను టూరిస్టులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. అయితే గోవా చట్టాల ప్రకారం ఇంటిని పేయింగ్‌ గెస్ట్‌ కోసం ఇవ్వాలంటే తప్పకుండా గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Yuvraj Singh: చిక్కుల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌.. జరిమానాతో పాటు నోటీసులు జారీచేసిన గోవా సర్కారు.. ఎందుకంటే?
Yuvraj Singh
Basha Shek
|

Updated on: Nov 23, 2022 | 7:40 AM

Share

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసలుఉ అందజేశారు. ఇచ్చిన గడువులోపు హాజరై తగిన వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..యువరాజ్ సింగ్ కు గోవాలోని మోర్జిమ్ లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. కాసా సింగ్ పేరుతో ఉన్న ఈ లగ్జరీ విల్లాను టూరిస్టులకు అద్దెకు ఇస్తానని యువరాజ్ సింగ్ ఆన్ లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. అయితే గోవా చట్టాల ప్రకారం ఇంటిని పేయింగ్‌ గెస్ట్‌ కోసం ఇవ్వాలంటే తప్పకుండా గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి.

అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే, ఇంటిని పర్యాటకుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం శాఖ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకం అని, అందుకు రూ.1 లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ అధికారులు వెల్లడించారు. హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గోవా సర్కారు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటీసులకు డిసెంబరు 8న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ సింగ్ ను గోవా ప్రభుత్వం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత