AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meet Cute: దర్శకురాలిగా మారిన నాని సోదరి.. ఓటీటీలో మీట్‌క్యూట్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్వయంకృషితో స్టార్‌ హీరోగా ఎదిగిన నాని ఫ్యామిలీ నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆయన సొదరి దీప్తి గంటా మెగాఫోన్‌ పట్టారు. ఆమె స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ మీట్ క్యూట్‌. అదా శర్మ, వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్‌ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రోహిణి మొల్లేటి, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Meet Cute: దర్శకురాలిగా మారిన నాని సోదరి.. ఓటీటీలో మీట్‌క్యూట్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nani's Sister Deepti Ganta
Basha Shek
|

Updated on: Nov 22, 2022 | 3:20 PM

Share

టాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్‌లు లేకుండా పైకొచ్చిన హీరోల్లో న్యాచురల్‌ స్టార్‌ నాని ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఉంటోన్న అతను నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఆ, హిట్ లాంటి ఆసక్తికరమైన సినిమాలను రూపొందిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇలా స్వయంకృషితో స్టార్‌ హీరోగా ఎదిగిన నాని ఫ్యామిలీ నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆయన సొదరి దీప్తి గంటా మెగాఫోన్‌ పట్టారు. ఆమె స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ మీట్ క్యూట్‌. అదా శర్మ, వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్‌ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రోహిణి మొల్లేటి, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నానినే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఐదు కథల సమాహారంతో ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్‌ ఈ నెల 25 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.

కాగా సోమవారం క్యూట్‌ మీట్‌ సిరీస్‌ ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్ పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన దీప్తి ‘నేను గతంలో ఒక షార్ట్‌ ఫిలిం చేశాను. మీట్‌ క్యూట్‌ లో ఒక స్టోరీ రాసి, నానీకి వినిపించాను. ఇలాంటివి ఇంకో మూడు నాలుగు కథలు రాస్తే ఆంథాలజీ సిరీస్‌ చేయవచ్చని సలహా ఇచ్చాడు. ప్రయాణాలు, ఇతర సందర్భాల్లో అపరిచిత వ్యక్తుల మధ్య మాటలు ఎలా ఉంటాయి? అనే ఊహజనిత ఆలోచనలతో ఈ స్క్రిప్ట్‌ రాశాను. నాని కోసం ఓ ప్రేమకథను రెడీ చేసే పనుల్లో ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.