AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: బంగ్లా టూర్‌కు ముందే భారత్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం.. మిస్టర్ 360 అరంగేట్రం చేస్ ఛాన్స్..

Ravindra Jadeja: బంగ్లాదేశ్‌తో క్రికెట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా గాయం కారణంగా ఈ టూర్‌కు దూరమయ్యాడు.

IND vs BAN: బంగ్లా టూర్‌కు ముందే భారత్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం.. మిస్టర్ 360  అరంగేట్రం చేస్ ఛాన్స్..
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Nov 23, 2022 | 11:10 AM

Share

భారత క్రికెట్ జట్టు వచ్చే నెల అంటే డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత జట్టు ఈ పర్యటన డిసెంబర్ 4 నుంచి వన్డే మ్యాచ్‌లతో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది.

సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం..

పీటీఐ, బీసీసీఐ ప్రకారం ‘జడేజా పునరావాసం కోసం NCAకి వెళ్లాడు. అయితే, బంగ్లాదేశ్ పర్యటనకు అతను ఫిట్‌గా ఉండే అవకాశం లేదు. దీంతో జడేజాను తప్పించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడంపై చర్చ జరుగుతోంది. సూర్యకు అవకాశం లభిస్తే టీ20, వన్డేల తర్వాత భారత్ తరపున టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన పేరును బోర్డు ఇంకా ప్రకటించలేదు.

సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అని తెలిసిందే. అతని ప్రస్తుత ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ తరపున సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ పర్యటనకు భారత వన్డే జట్టు ఇదే..

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ సుందర్ ఠాకూర్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.

బంగ్లాదేశ్ పర్యటనకు భారత టెస్టు జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ పటేల్ , శార్దూల్ ఠాకూర్, షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..