IND vs NZ: శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి అసలు కారణం అదే.. తేల్చేసిన హార్దిక్ పాండ్యా..
Sanju Samson: హార్దిక్ పాండ్యా సారథ్యంలో న్యూజిలాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి కెప్టెన్ ఎలాంటి కారణం చెప్పాడంటే..
న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న తర్వాత, హార్దిక్ పాండ్యాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఓ ప్లేయర్‌కు సంబంధించిన విషయంలోనే కావడం గమనార్హం. అయితే, ఇది టీమిండియా అభిమానులను కూడా వేధిస్తోన్న ప్రశ్న అని కూడా చెప్పవచ్చు. గత టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఎందుకు అవకాశం రాలేదనేది ప్రశ్నగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంతో మంది నిరంతరం అటు సెలక్షన్ కమిటీ, బీసీసీఐపైనా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అటునుంచి ఏ సమాధానం రాకపోవడంతో సంజూని రిటైర్మెంట్ చేయమని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎంతగా ఎదురుచూసినా అవకాశం రానప్పుడు ఇదే మంచి ఆప‌్షన్ అని సూచిస్తున్నారు. దీనిపై హార్దిక్ పాండ్యా మంగళవారం స్పందించాడు. వ్యూహాత్మక కారణాల వల్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో శాంసన్‌ను ఎంపిక చేయలేదని పాండ్యా చెప్పుకొచ్చాడు. దీనితో పాటు, ఎవరైనా అసంతృప్తిగా ఉంటే చర్చలకు ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉంటాయని ఆయన తెలిపాడు.
ప్రతి ఆటగాడికి పూర్తి అవకాశాలు లభిస్తాయని, ఇంకా చాలా సమయం ఉందని పాండ్యా తెలిపాడు. పాండ్యా మాట్లాడుతూ, ‘ఇది మూడు మ్యాచ్‌ల కంటే పెద్ద సిరీస్ అయితే, మేం అతనికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి ఉండేవాళ్లం. తక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో తరచూ మార్పులు చేయడంపై నాకు నమ్మకం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
టీమ్ కాంబినేషన్‌లో పాండ్యాకు అవకాశం రాలేదు..
‘ఆటగాళ్లు సురక్షితంగా ఉన్న చోట ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టం కాదని పాండ్యా తెలిపాడు. ఆటగాళ్లందరితో నాకు మంచి అనుబంధం ఉందని, అవకాశం రాని ఆటగాళ్లకు అది వ్యక్తిగత సమస్య కాదని తెలుసు. టీమ్ కాంబినేషన్ కారణంగా అతనికి అవకాశం రాలేదు. ఎవరైనా క్రీడాకారుడు వేరేలా భావిస్తే, నా తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి, వారు నాతో మాట్లాడగలరు. నేను వారి భావాలను అర్థం చేసుకున్నాను. శాంసన్ కేసు దురదృష్టకరం. మేం అతనికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. కానీ వ్యూహాత్మక కారణాల వల్ల అతను ప్లేయింగ్ XIలో చేరలేకపోయాడు’ అంటూ పేర్కొన్నాడు.
శాంసన్‌కు ఏడేళ్లలో 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం..
సంజూ శాంసన్ 2015 సంవత్సరంలో టీమ్ ఇండియా కోసం తన టీ20 అరంగేట్రం చేశాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ఆటగాడు గత ఏడేళ్లలో 16 T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అదే సమయంలో, అతని పేరుకు కేవలం 10 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు గత నాలుగేళ్లలో పంత్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి.
టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు రెండు అవకాశాలు లభించాయి. అతను రెండింటిలోనూ ఫ్లాప్ అయ్యాడు. ఈ ఆటగాడు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లోనూ విఫలమయ్యాడు. 66 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంత్ సగటు 25 కంటే తక్కువ. అతని స్ట్రైక్ రేట్ కూడా 125 కంటే తక్కువ. అలాగే, అతని బ్యాట్ నుంచి కేవలం 3 అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ పంత్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై మాజీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..