FIFA WC 2022: వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమి అంటే తెలియదు.. చివరి 5 విజయాలైతే ఏకపక్షమే.. నేటి నుంచి బరిలోకి లియోనెల్ మెస్సీ టీం..

ARG vs KSA: ఫిఫా ప్రపంచ కప్‌లో నేటి తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా వర్సెస్ సౌదీ అరేబియా ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లుసైల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.

FIFA WC 2022: వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమి అంటే తెలియదు.. చివరి 5 విజయాలైతే ఏకపక్షమే.. నేటి నుంచి బరిలోకి లియోనెల్ మెస్సీ  టీం..
Argentina Vs Saudi Arabia
Follow us
Venkata Chari

|

Updated on: Nov 22, 2022 | 12:49 PM

ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022), అర్జెంటీనా తన ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించనుంది. నేడు సౌదీ అరేబియాతో తలపడనుంది. అర్జెంటీనా గత 36 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు. అలాగే చివరి ఐదు మ్యాచ్‌లలో ఏకపక్షంగా విజయం సాధిస్తూ వస్తోంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఫార్వర్డ్‌లు 16 గోల్స్ చేయగా, జట్టు డిఫెన్స్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

ఫిఫా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా 3వ స్థానంలో ఉంది. అదే సమయంలో సౌదీ అరేబియా 51వ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కూడా అర్జెంటీనాకు అనుకూలంగానే సాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.

ఈసారి అర్జెంటీనా ప్రపంచకప్ ట్రోఫీ కోసం పోటీదారుగా బరిలోకి దిగనుంది. లియోనెల్ మెస్సీకి బహుశా ఇదే చివరి ప్రపంచకప్. ఈసారి అర్జెంటీనా విజయం సాధించాలని ప్రపంచ వ్యాప్తంగా మెస్సీ అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ జట్టు కూడా అద్భుతమైన ఫాంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో అర్జెంటీనా 1978, 1986 చరిత్రను మరోసారి పునరావృతం చేయగలదని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, సౌదీ అరేబియా కనీసం 1994 ప్రదర్శనను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. 1994 ప్రపంచకప్‌లో ఈ జట్టు 16వ రౌండ్‌కు చేరుకుంది. అయితే, ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ జట్టు తమ చివరి 10 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.

దృష్టంతా వీరిపైనే..

లియోనెల్ మెస్సీ ఎప్పుడైతే ఫీల్డ్‌లోకి వస్తాడో.. వెంటనే అందరిచూపు అతనిపైనే ఉంటుంది. కచ్చితంగా ఈ మ్యాచ్‌లోనూ అతనే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడు. అర్జెంటీనాకు మెస్సీ ప్లే మేకర్ పాత్రలో కనిపించనున్నాడు. అతనితో పాటు ఏంజెల్ డి మారియా, లియాండ్రో పరేడెజ్, నికోలస్ ఆటోమెండి వంటి స్టార్ ఆటగాళ్లు కూడా బరిలో ఉంటారు. మరోవైపు, సౌదీ అరేబియా జట్టు ఎక్కువగా తమ సెంటర్ బ్యాక్ ప్లేయర్ అబ్దుల్లా అల్ అమ్రీ, లెఫ్ట్ బ్యాక్ యాసిర్ అల్ షహ్రానీపై ఆధారపడి ఉంటుంది. ఫార్వర్డ్ ప్లేయర్‌లో ఫిరాస్ అల్-బురైఖాన్ నుంచి ఏదైనా ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..