- Telugu News Photo Gallery Cricket photos Key players released by ipl teams before ipl 2023 from mayank agarwal kane williamson to dwayne bravo kieron pollard
IPL 2023: డేంజరస్ ఫినిషర్ నుంచి బెస్ట్ కెప్టెన్ వరకు.. దిగ్గజాలకు ఊహించని షాకిచ్చిన ఫ్రాంచైజీలు..
ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇందులో చాలా మంది పెద్ద ప్లేయర్లకు భారీ షాక్ తగిలింది.
Updated on: Nov 15, 2022 | 9:04 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. విడుదలైన ఆటగాళ్ల జాబితాలో చాలామంది కీలక ప్లేయర్లు ఉన్నారు. తదుపరి సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఇందులో అతిపెద్ద పేరు కేన్ విలియమ్సన్ ది. విలియమ్సన్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు. అతను చాలా కాలం పాటు జట్టుతో ఉన్నాడు. కానీ, ఈసారి అతను ఈ జట్టులో కనిపించడు. గత సీజన్‌లో విలియమ్సన్‌కు ఫ్రాంచైజీ రూ.14 కోట్లు ఇచ్చింది.

ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్‌ను కూడా విడుదల చేసింది. పూరన్‌ను గతేడాది ఈ జట్టు రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసినా ఈ బ్యాట్స్‌మన్ అంచనాలను అందుకోలేకపోయాడు.

చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన డ్వేన్ బ్రావో ఈ సీజన్‌లో చెన్నై తరపున ఆడడం లేదు. నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన అతడిని విడుదల చేశారు. బ్రావో ఒకప్పుడు జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ కూడా ఈసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడడం లేదు. అతను IPL నుంచి రిటైర్ అయ్యాడు. అతను 2010 నుంచి జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం ముంబై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేయనున్నాడు.

మయాంక్ అగర్వాల్ గతేడాది పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా విజయం సాధించలేకపోయాడు. అతను కూడా ఈ సంవత్సరం ఫ్రాంచైజీ ద్వారా విడుదలయ్యాడు. గత ఏడాది మయాంక్ కోసం ఫ్రాంచైజీ రూ.12 కోట్లు వెచ్చించింది.




