- Telugu News Photo Gallery Cricket photos Who can replace kane williamson in sunrisers hyderabad as captain here is the list
IPL 2023: మినీ వేలానికి ముందు విలియమ్సన్ ఔట్.. మరి ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఎవరు.? లిస్టులో ఆ నలుగురు
ఈ ఏడాది అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ విఫలం కావడంతో.. మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం..
Updated on: Nov 17, 2022 | 8:42 AM

ఈ ఏడాది అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ విఫలం కావడంతో.. మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అతడ్ని విడుదల చేసింది. మరి విలియమ్సన్‌కి ప్రత్యామ్నాయంగా SRHకి కెప్టెన్ ఎవరు అవ్వగలరు. ఆ లిస్టు ఏంటో చూసేద్దాం..

ఇందులో ఫస్ట్ ఆప్షన్ భువనేశ్వర్ కుమార్. కొత్త ఆటగాడిని టీమ్‌లోకి తీసుకుని కెప్టెన్సీ ఇచ్చే బదులు.. చాలాకాలం పాటు టీమ్‌తో ఉన్న సీనియర్ ప్లేయర్, కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. గతేడాది విలియమ్సన్ చివరి మ్యాచ్‌లో ఆడనప్పుడు భువనేశ్వర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మార్క్‌రమ్.. తన కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాకు అండర్-19 ప్రపంచకప్ అందించాడు. అతను గత ఏడాది SRH జట్టులోకి వచ్చాడు. భవిష్యత్తులో పగ్గాలు కూడా చేపట్టే అవకాశం ఉంది.

జాసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. హోల్డర్ అంతకుముందు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఫ్రాంచైజీ అతడిని తిరిగి జట్టులోకి తీసుకుని కెప్టెన్‌గా చేయవచ్చు.

మయాంక్ అగర్వాల్ గతేడాది పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా జట్టును ప్లేఆఫ్‌కు చేర్చలేకపోయాడు. ఈ ఏడాది ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది. సన్‌రైజర్స్ మయాంక్ పేరును కూడా పరిగణించవచ్చు. విలియమ్సన్ స్థానంలో ఓపెనర్‌గా మయాంక్ వేగంగా పరుగులు చేయగలడు. మెరుగైన కెప్టెన్‌గా కూడా నిరూపించుకోగలడు.




