AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కో గోల్‌కి ఒక్కో డాన్స్.. ప్రతీ మ్యాచ్‌కి 10 రకాల మూమెంట్స్.. మా సెలబ్రేషన్స్‌తో అట్లుంటది మరి..

FIFA World Cup, Brazil vs Serbia: సెర్బియాతో మ్యాచ్ కోసం మేం సిద్ధంగా ఉన్నాం. అందుకోసం మావద్ద పది రకాల డ్యాన్స్ మూమెంట్స్ సిద్ధంగా ఉన్నాయని బార్సిలోనా స్టార్ చెప్పుకొచ్చాడు.

ఒక్కో గోల్‌కి ఒక్కో డాన్స్.. ప్రతీ మ్యాచ్‌కి 10 రకాల మూమెంట్స్.. మా సెలబ్రేషన్స్‌తో అట్లుంటది మరి..
Fifa World Cup 2022
Venkata Chari
|

Updated on: Nov 22, 2022 | 11:51 AM

Share

ఈరోజు ఫిఫా వరల్డ్ కప్ 2022లో 6 జట్లు ఫీల్డ్‌లో ఉంటాయి. అంటే మొత్తం 3 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫుట్‌బాల్ అభిమానులకు సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఈరోజు రంగంలోకి దిగనున్న 6 జట్లలో అర్జెంటీనా కూడా ఉంది. దీంతో పాటు సౌదీ అరేబియా, ట్యునీషియా, డెన్మార్క్, మెక్సికో, పోలాండ్ జట్లు కూడా ఈరోజు తొలి మ్యాచ్ ఆడనున్నాయి. FIFA ప్రపంచ కప్ 2022 మ్యాచ్ నవంబర్ 22న అర్జెంటీనా మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇది సౌదీ అరేబియాతో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

అయితే, అంతకుముందు FIFA వరల్డ్ కప్ 2022 లో, నెదర్లాండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. టోర్నమెంట్ రెండవ రోజు, నెదర్లాండ్స్ 2-0తో సెనెగల్‌ను ఓడించగా, ఇంగ్లండ్ 6-2తో ఇరాన్‌ను ఓడించింది. అదే సమయంలో అమెరికా, వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇంతలో ఓ ఆసక్తికరమైన పోరు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అదే బ్రెజిల్, సెర్బియా మ్యాచ్. ఈ రెండు జట్లు మైదానంలో దిగితే పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. గ్రూప్ స్టేజ్‌లో శుక్రవారం బ్రెజిల్ వర్సెస్ సెర్బియా జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, అంతకుముందు బ్రెజిల్ అటాకర్ అటాకర్ రఫిన్హా సెర్బియాతో కీలక పోరుకుముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సెర్బియాతో మ్యాచ్ కోసం మేం సిద్ధంగా ఉన్నాం. అందుకోసం మావద్ద పది రకాల డ్యాన్స్ మూమెంట్స్ సిద్ధంగా ఉన్నాయని బార్సిలోనా స్టార్ చెప్పుకొచ్చాడు. నవంబర్ 25న గ్రూప్ జిలో సెలెకావోస్ సెర్బియాతో తలపడనుంది.

“నిజం చెప్పాలంటే, మేం ఇప్పటికే 10వ గోల్ వరకు డ్యాన్స్‌లను సిద్ధం చేశాం. మేం ప్రతి మ్యాచ్‌కి 10 డ్యాన్స్‌లను సిద్ధం చేశాం. మొదటిది గోల్ కోసం ఒక డ్యాన్స్ మూమెంట్, రెండవ గోల్ కోసం మరొక మూమెంట్, మూడవదానికి మరో ఢిపరెంట్ మూమెంట్… ఇలా ఎక్కువ స్కోర్ చూస్తూ పోతే ఎక్కువ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంటాం” అని చెప్పుకొచ్చాడు.

ఈ పది డ్యాన్స్ మూమెంట్స్ కోసం జట్టులోని ప్రతీ ఆటగాడు రెడీ అయ్యాడు. ముఖ్యంగా Neymar Jr., Vinicius Jr., Rodrygo వంటి సూపర్ స్టార్లు గోల్స్ చేసిన అనంతరం డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే రిహార్సల్ కూడా చేశామని ఆయన చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..