FIFA World Cup 2022: 21 ప్రపంచ కప్‌లు.. 8 జట్లదే తిరుగులేని ఆధిపత్యం.. ఫిఫాలో ఆసక్తికర విషయాలు మీకోసం..

Football World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ నవంబర్ 20 నుంచి ఖతార్‌లో ప్రారంభమవుతుంది. మిడిల్ ఈస్ట్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించడం ఇదే తొలిసారి.

FIFA World Cup 2022: 21 ప్రపంచ కప్‌లు.. 8 జట్లదే తిరుగులేని ఆధిపత్యం.. ఫిఫాలో ఆసక్తికర విషయాలు మీకోసం..
Fifa World Cup 2022
Follow us
Venkata Chari

|

Updated on: Nov 15, 2022 | 9:59 PM

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ మొదటిసారి 1930లో జరిగింది. ఆ తర్వాత దక్షిణ అమెరికా దేశం ఉరుగ్వేలో నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి. అందులో 8 జట్లు టైటిల్‌ను గెలుచుకున్నాయి. బ్రెజిల్ జట్టు (5) అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, జర్మనీ తలో 4 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఆతిథ్య దేశం మాత్రమే 6 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ కప్‌కు సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు చూద్దాం..

16: ఇప్పటివరకు అత్యధిక ప్రపంచకప్ గోల్స్ (16) సాధించిన ఆటగాడిగా జర్మనీకి చెందిన స్ట్రైకర్ మిరోస్లావ్ క్లోస్ నిలిచాడు. అతను 2002, 2014 మధ్య ఈ గోల్స్ చేశాడు.

13: ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. 1958లో ఈ జట్టు 13 గోల్స్ చేసింది.

56: 1986 ప్రపంచ కప్‌లో, ఉరుగ్వే ఆటగాడు జోస్ బాటిస్టా కేవలం 56 సెకన్లలో రెడ్ కార్డ్ బాధితుడయ్యాడు.

3,34,000: ఫిఫా ప్రపంచకప్‌ను ఆడిన అతి చిన్న దేశం ఐస్‌లాండ్. 2018లో ఈ దేశం ప్రపంచకప్‌లో అడుగుపెట్టినప్పుడు దాని జనాభా 3.5 లక్షలు కూడా లేదు.

80: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తమ జట్టును రంగంలోకి దించిన 80వ దేశంగా ఖతార్ అవతరించింది.

32: ఫిఫా ప్రపంచ కప్ 2022లో 32 జట్లు పాల్గొంటున్నాయి. 1998 నుంచి ప్రతి ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొంటున్నాయి.

27.7: ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు అత్యంత పురాతనమైనది. ఈ జట్టు సగటు వయస్సు 27.7 సంవత్సరాలు.

24.5: యూఏఎస్ ఖతార్‌లో అతి పిన్న వయస్కుడైన జట్టును కలిగి ఉంది. ఈ జట్టు సగటు వయస్సు 24.5 సంవత్సరాలు.

5 బిలియన్లు: ఖతార్‌లో జరిగే FIFA ప్రపంచ కప్‌ను భూమిపై ఉన్న జనాభాలో సగానికి పైగా ప్రజలు వీక్షిస్తారని భావిస్తున్నారు.

11,582: FIFA ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న అతి చిన్న దేశం ఖతార్. ఈ దేశ వైశాల్యం కేవలం 11,582 చదరపు కి.మీ.

357: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం ప్రైజ్ మనీ రూ.357 కోట్లు.