AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs ENG: 1043 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ.. 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్..

David Warner: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ కోసం రెండున్నరేళ్ల తర్వాత తెరపడినట్లే.. తాజాగా 2 ఏళ్ల 10 రోజుల తర్వాత అంటే మొత్తం 1043 రోజుల తర్వాత డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ సెంచరీ కోసం నిరీక్షణకు కూడా తెరపడింది.

AUS vs ENG: 1043 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ.. 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్..
Aus Vs Eng David Warner
Venkata Chari
|

Updated on: Nov 22, 2022 | 3:07 PM

Share

ప్రపంచ క్రికెట్‌లో మొత్తానికి ఫాంలో లేని క్రికెటర్లకు మంచిరోజులు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే సెంచరీ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న స్టార్ ప్లేయర్లు సైతం.. ఆ కోరికను తీర్చుకుంటూ తమ నిరీక్షణకు తెరదింపుతున్నారు. అలాంటి వారిలో మొదట విరాట్ కోహ్లీ, ఇప్పుడు డేవిడ్ వార్నర్ నిలిచారు. ప్రస్తుత కాలంలోని ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లకు ఒకే ఒక సమస్య ఉంది. హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లతోనే సరిపెట్టుకుంటున్న వీరు.. ప్రస్తుతం సెంచరీల దాహం తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని నెలల క్రితం మాదిరిగానే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ కోసం రెండున్నరేళ్ల తర్వాత నిరీక్షణకు తెరపడింది. అదేవిధంగా ఇప్పుడు 2 ఏళ్ల 10 రోజుల తర్వాత అంటే మొత్తం 1043 రోజుల తర్వాత డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ సెంచరీ కోసం నిరీక్షణకు కూడా తెరపడింది. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు.

మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో డేవిడ్ వార్నర్ 102 బంతులు ఎదుర్కొని 106 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఎడమచేతి వాటం కలిగిన ఆస్ట్రేలియా ఓపెనర్‌కు వన్డే కెరీర్‌లో ఇది 18వ సెంచరీ. అంతర్జాతీయ కెరీర్‌లో 43వ సెంచరీగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

43వ అంతర్జాతీయ సెంచరీ కోసం 1043 రోజులు..

అయితే డేవిడ్ వార్నర్ తన 43వ అంతర్జాతీయ సెంచరీ కోసం చాలాకాలం వేచి ఉండాల్సి వచ్చింది. 1043 రోజుల తర్వాత అతని బ్యాట్ నుంచి ఈ సెంచరీ వచ్చింది. అతను తన చివరి సెంచరీని 14 జనవరి 2020న వాంఖడేలో భారత్‌పై సాధించాడు. అప్పటి నుంచి నేటి వరకు వార్నర్ బ్యాట్ సెంచరీ రాలేదు. తాజాగా మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ సాధించడమే కాకుండా, తన ఓపెనింగ్ భాగస్వామి ట్రెవిడ్ హెడ్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. ఇది 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వార్నర్‌, హెడ్‌ల..

డేవిడ్ వార్నర్‌తో పాటు మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ కూడా సెంచరీ సాధించాడు. వార్నర్ 106 పరుగులు చేసినప్పుడు, హెడ్ 130 బంతుల్లో 152 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య 269 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇది మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల వన్డే ఇంటర్నేషనల్‌లో అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్ పేరిట ఉంది. వీరిద్దరూ 2002లో ఇంగ్లండ్‌పై 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ విధంగా, హెడ్, వార్నర్ MCGలో అతిపెద్ద భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..