IND vs NZ 3rd T20I: అర్షదీప్, సిరాజ్ దెబ్బకు కివీస్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లకు కివీ జట్టు 160 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 161 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో మ్యాచ్ నేపియర్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లకు కివీ జట్టు 160 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 161 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. న్యూజిలాంట్ బ్యాటర్లలో కాన్వే 59, పిలిప్స్ 54 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగతా బ్యాటర్లలో 7గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక భారత బౌలర్లలో అర్షదీప్ 4, సిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు.
అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్‌కు తొలి దెబ్బ ఇచ్చాడు. రెండో ఓవర్ మూడో బంతికి ఫిన్ అలెన్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. అలెన్ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి ఔటయ్యాడు.
కివీస్ జట్టులో మహ్మద్ సిరాజ్ రెండో వికెట్ తీశాడు. అతను 12 బంతుల్లో 12 పరుగులు చేసిన తర్వాత మార్క్ చాప్‌మన్‌ను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ అవుట్ చేశాడు.
న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 33 బంతులు ఎదుర్కొని 163 స్ట్రైక్ రేట్‌తో 54 పరుగులు చేశాడు. అతడి వికెట్‌ను మహ్మద్ సిరాజ్ తీశాడు.
49 బంతుల్లో 59 పరుగులు చేసి డెవాన్ కాన్వే అవుటయ్యాడు. అతని వికెట్‌ను అర్ష్‌దీప్ సింగ్ తీశాడు.
జేమ్స్ నీషమ్ రూపంలో మహ్మద్ సిరాజ్ మూడో వికెట్ తీశాడు. అదే సమయంలో, మిచెల్ సాంట్నర్‌ను 1 పరుగు వద్ద అవుట్ చేయడం ద్వారా నాలుగో వికెట్ పడగొట్టాడు.
రెండు జట్లలోనూ ఒక్కో మార్పు..
టీమిండియా ప్లేయింగ్ 11లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌కు అవకాశం దక్కింది. అదే సమయంలో, కేన్ విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్మన్ న్యూజిలాండ్ ప్లేయింగ్ XIలోకి వచ్చాడు.
రెండు జట్ల ప్లేయింగ్ XI…
భారత్: ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (WK), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్.
సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకం కానుంది. రెండో మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి, సిరీస్‌ను గెలుచుకోవాలని చూస్తోంది. కాగా, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్య సమస్యల కారణంగా జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరమయ్యాడు. టిమ్ సౌథీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..