AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలో ఉన్న హ్యాండ్సమ్‌ హీరోను గుర్తుపట్టారా? లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల ఫేవరెట్‌ హీరో అయ్యాడండోయ్

రుస ప్రేమకథ చిత్రాల్లో నటిస్తూ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.అలాగే మాస్‌ చిత్రాలతోనూ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేశాడు. అన్నట్లు ఇటీవల బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడండోయ్‌.

Tollywood: ఈ ఫొటోలో ఉన్న హ్యాండ్సమ్‌ హీరోను గుర్తుపట్టారా? లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల ఫేవరెట్‌ హీరో అయ్యాడండోయ్
Tollywood Hero
Basha Shek
|

Updated on: Nov 23, 2022 | 9:12 AM

Share

పై ఫొటోలో ఉన్నది ఓ స్టార్‌ హీరో. టాలీవుడ్‌లో ఓ బడా ఫ్యామిలీ మూడో తరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా వరుస ప్రేమకథ చిత్రాల్లో నటిస్తూ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.అలాగే మాస్‌ చిత్రాలతోనూ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేశాడు. అన్నట్లు ఇటీవల బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడండోయ్‌. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, స్టార్‌ హీరోగా ఎదిగినా అతనిలో ఎలాంటి భేషజాలు ఉండవు. ప్రొఫెషనల్‌గా కానీ, పర్సనల్‌గా కానీ పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. అందుకే సినిమా పరిశ్రమలో ఈ స్టార్‌ హీరోకు క్లీన్‌ ఈమేజ్‌ ఉంది. ఇదే అతనికి సఫరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను తెచ్చిపెట్టింది. ఇలా నటనలో తాత, తండ్రిల వారసత్వాన్ని నిలబెడుతూ టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న ఈ హ్యాండ్సమ్‌ హీరో..

మరెవరో కాదు అక్కినేని అందగాడు నాగచైతన్య. అక్కినేని వంశం నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతూ నటనలో నాగేశ్వర రావు, నాగార్జున వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మాయ చేశామే, 100 పర్సెంట్‌ లవ్‌, ప్రేమమ్‌, ఒక లైలా కోసం, మనం, రారండోయ్‌ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామా, లవ్‌స్టోరీ, థ్యాంక్యూ’ వంటి ప్రేమకథా చిత్రాలతో అమ్మాయిల ఫేవరెట్‌ హీరోగా మారిపోయాడు. అదే సమయంలో జోష్‌, ఆటోనగర్‌ సూర్య,సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు, బంగార్రాజు తదితర సినిమాలతో మాస్‌ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.2003లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతూ ఇప్పటివరకు 20 సినిమాలు పూర్తి చేశాడు. వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికి వెళ్లని చైతన్య 2017లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే 2021లో ఆమెతో విడాకులు తీసుకుని విడిపోయాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ ముందుకు సాగుతోన్న ఈ అక్కినేని హీరో నేడు (నవంబర్‌ 23) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి మనం కూడా అతనికి బర్త్‌ డే విషెస్‌ చెబుదాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..