AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. ఆస్పత్రిలో చేరిందంటూ వార్తలు.. మేనేజర్‌ ఏమన్నారంటే?

కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయినా చేతికి సెలైన్‌ పెట్టుకుని మరీ యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పింది. శరీరం సహకరించలేకపోయినా తనవంతు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది.

Samantha: సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. ఆస్పత్రిలో చేరిందంటూ వార్తలు.. మేనేజర్‌ ఏమన్నారంటే?
Yashoda ott
Basha Shek
|

Updated on: Nov 24, 2022 | 9:54 AM

Share

ప్రముఖ నటి సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె మళ్లీ ఆస్పత్రిలో చేరినట్లు తమిళ ఛానెల్స్‌లో బ్రేకింగ్‌ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వదంతులేనని కొట్టి పారేశారుసామ్‌ కుటుంబ సభ్యులు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్‌ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్‌ కోరాడు. కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయినా చేతికి సెలైన్‌ పెట్టుకుని మరీ యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పింది. శరీరం సహకరించలేకపోయినా తనవంతు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది.

కాగా సామ్‌ ప్రధాన పాత్రలో నటించినయశోద నవంబర్‌ 11న థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడంతో యశోద కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్‌ సంయుక్తంగా యశోదను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్‌, వరలక్ష్మి, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ తదితర ప్రముఖులు నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..