Manchu Manoj: మంచు విష్ణు బర్త్‌డే.. జంబలకిడి జారు మిఠాయి సాంగ్‌తో విష్‌ చేసిన మనోజ్‌.. ట్రెండింగ్‌లో వీడియో

సినిమాలో కూడా ఈ పాట ఇంత పాపులర్ అవ్వలేదు.. కానీ భారతమ్మ స్టేజ్ పైన పడిన పాట మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చాలా మంది ఈ పాటకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌ చేస్తున్నారు.

Manchu Manoj: మంచు విష్ణు బర్త్‌డే.. జంబలకిడి జారు మిఠాయి సాంగ్‌తో విష్‌ చేసిన మనోజ్‌.. ట్రెండింగ్‌లో వీడియో
Manchu Manoj
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2022 | 11:34 AM

జంపలకడి జారు మిఠాయా.. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పాటకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్టేటస్‌.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా ముందు ఇదే పాట వినిపిస్తోంది. అంతలా జనాళ్లలోకి వెళ్లిపోయిందీ పాట. జిన్నా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఫోక్‌ సింగర్‌ భారతమ్మ ఈ పాటను ఆలపించారు. అయితే ఒరిజినల్‌ జానపద పాటకు, ఈ సాంగ్‌కు చాలా తేడా ఉంది. అయితే సినిమాలో కూడా ఈ పాట ఇంత పాపులర్ అవ్వలేదు.. కానీ భారతమ్మ స్టేజ్ పైన పడిన పాట మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చాలా మంది ఈ పాటకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌ చేస్తున్నారు. కొంతమంది ఫన్నీ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ట్రోల్స్‌ కూడా అదే రేంజ్‌లో వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.ఈ క్రమంలో హీరో మంచు మనోజ్‌ తాజాగా సింగర్‌ భారతమ్మను కలిశారు. అంతేకాదు అభిమానుల ముందు ఆమెతో జంపలకడి జారు మిఠాయి పాట పాడించారు.

ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సోదరుడు మంచు విష్ణుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్‌ వ్యక్తిగత విషయాలతో మాత్రం వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అతను దివంగత రాజకీయ నేత భూమానాగిరెడ్డి రెండో కూతురు మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో వినాయకుడి మండపం దగ్గర హఠాత్తుగా ప్రత్యక్షమై హల్‌చల్‌ చేశారు. దీంతో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారని వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..