Kamal Haasan: కమల్‌ హాసన్‌కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు.

Kamal Haasan: కమల్‌ హాసన్‌కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్
Kamal Haasan
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2022 | 9:57 AM

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. కమల్‌హాసన్‌ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇప్పుడు శ్వాస సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు.  కాగా పోస్ట్ కోవిడ్ ల‌క్ష‌ణాలు అయ్యుంటాయ‌ని, అందుక‌నే ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందులు వ‌చ్చాయని తెలుస్తోంది. కాగా నిన్ననే  ఆయ‌న హైదరాబాద్ కు వచ్చారు. ప్రముఖ దర్శకుడు క‌ళా త‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌ని క‌లిశారు. సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లిపోయారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కమల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కమల్ హాసన్ కథానాయకుడిగా, నిర్మాతగానూ ‘విక్రమ్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో కమల్ హాసన్ భారీ విజయాన్ని అందుకున్నారు. నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో బిగ్ బాస్ షోతోనూ బిజీగా మారాడు. ఈలోగా ఆయన ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి