Actress: ఈ ఫొటోలోని రెండు జళ్ల సీతను గుర్తుపట్టారా? ఈ స్టార్‌ హీరోయిన్‌ ఇటీవల దెయ్యం పాత్రలో భయపెట్టిందండోయ్‌

ఈ ఫొటోలో రెండు జడలు వేసుకుని క్యూట్ స్మైల్‌ ఇస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. అంతేకాకుండా మరో స్టార్ హీరోకి సతీమణి కూడా. బాలీవుడ్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నప్పటికీ తెలుగులోనూ ఈమెకు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది.

Actress: ఈ ఫొటోలోని రెండు జళ్ల సీతను గుర్తుపట్టారా? ఈ స్టార్‌ హీరోయిన్‌ ఇటీవల దెయ్యం పాత్రలో భయపెట్టిందండోయ్‌
Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 12:57 PM

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్స్ త్రో బ్యాక్‌ పిక్స్ నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. అలా తాజాగా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో రెండు జడలు వేసుకుని క్యూట్ స్మైల్‌ ఇస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. అంతేకాకుండా మరో స్టార్ హీరోకి సతీమణి కూడా. బాలీవుడ్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నప్పటికీ తెలుగులోనూ ఈమెకు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది. అందుకే దక్షణాదిన సినిమాల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తోందీ సొగసరి. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ క్వీన్‌ మరెవరో కాదు..

బాలీవుడ్‌ అందాల సుందరి కత్రినా కైఫ్‌. మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని నెలల క్రితం హీరో విక్కీ కౌశల్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వెడ్డింగ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తూనే సినిమా షూటింగులకు హాజరైంది. అలా తాజాగా ఫోన్‌ బూత్ అనే సూపర్‌ న్యాచురల్‌ కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె దయ్యం పాత్రలో నటించి అందరినీ భయపెట్టింది. అన్నట్లు ఇటీవల పొన్నియన్ సెల్వన్‌ సినిమాను చూసిన ఈ సొగసరి మళ్లీ దక్షిణాది సినిమాల్లో నటించాలన్న కోరికను వెలిబుచ్చింది. అందుకు తగ్గట్లే విజయ్‌ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్‌ అనే సినిమాకు కమిట్‌ అయ్యింది. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్‌డేట్‌ రానుంది. దీంతో పాటు సల్మాన్‌తో కలిసి టైగర్‌ 3 సినిమాలోనూ నటిస్తోంది క్యాట్‌.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ