Team India: వన్డేల్లో టీమిండియాకు మరో మొనగాడు.. దుమ్ములేపుతున్న నయా ‘కోహ్లీ’.. నెంబర్స్ చూస్తే షాకే!
ధావన్, గిల్, సుందర్, శాంసన్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా మన బ్యాట్స్‌మెన్లు కష్టతరమైన పిచ్‌పై 306 పరుగుల స్కోరును సాధించారు.
ఆక్లాండ్ వన్డేలో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని చెప్పాలి. ధావన్, గిల్, సుందర్, శాంసన్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా మన బ్యాట్స్‌మెన్లు కష్టతరమైన పిచ్‌పై 306 పరుగుల స్కోరును సాధించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నుంచి మూడు అర్ధ సెంచరీలు వచ్చాయి. ధావన్, గిల్, శ్రేయాస్ అయ్యర్.. ఈ ఫిఫ్టీలు సాధించగా.. మ్యాచ్‌లో అత్యంత ప్రభావవంతమైన ఇన్నింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌ది అని చెప్పాలి. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 76 బంతుల్లో 80 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అలాగే సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్‌లతో రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీనితోనే టీమిండియా నిర్ణీత ఓవర్లకు 300 పరుగులు దాటగలిగింది. ఇదిలా ఉంటే.. శ్రేయాస్ అయ్యర్ గత 8 వన్డేల గణాంకాలు పరిశీలిస్తే.. అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. 5 అర్ధ సెంచరీలు, 1 శతకంతో ఏకంగా 512 పరుగులు బాదేశాడు.
వన్డేల్లో శ్రేయాస్ అత్యుత్తమం..
T20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవచ్చు. కానీ వన్డేల్లో మాత్రం ఈ ఆటగాడు అమోఘం. ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌లో శ్రేయాస్ అయ్యర్ నిరంతరం పరుగులు పారిస్తున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గత 8 ఇన్నింగ్స్‌ల్లో 512 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అలాగే అయ్యర్ రెండుసార్లు నాటౌట్‌గా నిలవడం విశేషం. వన్డేల్లో మూడో, నాలుగు స్థానాలు శ్రేయాస్ అయ్యర్‌కు బాగా అచ్చొచ్చాయి. విరాట్ కోహ్లీ మాదిరిగా పరుగుల వరద కురిపిస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. కింగ్ కోహ్లీ స్థానాన్ని వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేయగలడని భావిస్తున్నారు.
న్యూజిలాండ్‌లో శ్రేయాస్ అయ్యర్ సాటిలేదు..
శ్రేయాస్ అయ్యర్‌కు న్యూజిలాండ్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ గత న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. అయ్యర్ 72 కంటే ఎక్కువ సగటుతో 217 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి కివీస్‌ను రఫ్ఫాడించాడు.
షార్ట్ బాల్‌ను అయ్యర్ మెరుగ్గా ఎదుర్కోగలడు..
శ్రేయాస్ అయ్యర్‌కు షార్ట్ బాల్ వీక్‌నెస్ అని చాలామంది మాజీ ఆటగాళ్ల అభిప్రాయం. గత కొన్ని మ్యాచ్‌ల్లో అతడు షార్ట్ బాల్‌కు అవుట్ కావడమే ఇందుకు కారణం. అయ్యర్ ఈ బలహీనతను సమర్ధవంతంగా ఎదుర్కున్నాడు. ఆక్లాండ్ ODIలో ఈ ఆటగాడు పూర్తి సన్నద్ధతతో తన ఇన్నింగ్స్ చక్కదిద్దుకున్నాడు. షార్ట్ బాల్‌లో అయ్యర్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఒక్కసారి కుదురుకున్నాక.. అతడు షార్ట్ పిచ్ బంతుల్లో పరుగుల వరద పారించాడు.
Shreyas Iyer in last 8 innings in ODI format:
80(111) 54(57) 63(71) 44(34) 50(37) 113*(111) 28*(23) 80(76)
This is ridiculous consistency. pic.twitter.com/MjTn6XP99I
— Johns. (@CricCrazyJohns) November 25, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం