భారత క్రికెట్‌ చరిత్రలో కనివినీ ఎరుగని విషాదం.. మ్యాచ్ మధ్యలోనే 9మంది మృత్యువాత.. అయినా కొనసాగిన మ్యాచ్‌

27 ఏళ్ల క్రితం ఇదే రోజు (నవంబర్‌26)న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ వన్డే మ్యాచ్‌ జరిగింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. నాథన్ ఆస్టల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో కివీస్‌కు మరుపురాని విజయం అందించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్‌ ఓ ఘోర దుర్ఘటనకు సాక్షిగా నిలిచింది.

భారత క్రికెట్‌ చరిత్రలో కనివినీ ఎరుగని విషాదం.. మ్యాచ్ మధ్యలోనే  9మంది మృత్యువాత.. అయినా కొనసాగిన మ్యాచ్‌
Nagpur Stadiun
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2022 | 9:29 AM

ప్రస్తుతం భారతజట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తో గెల్చుకుంది. దీని రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ కూడా ప్రారంభమైంది.శుక్రవారం (నవంబర్ 25) జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ గెలిచింది. యాదృచ్ఛికంగా 27 ఏళ్ల క్రితం ఇదే రోజు (నవంబర్‌26)న ఇరుజట్ల మధ్య ఓ వన్డే మ్యాచ్‌ జరిగింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. నాథన్ ఆస్టల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో కివీస్‌కు మరుపురాని విజయం అందించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్‌ ఓ ఘోర దుర్ఘటనకు సాక్షిగా నిలిచింది. 1995లో ఐదు వన్డేల సిరీస్‌ను ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. నవంబర్‌ 25న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి వన్డే మ్యాచ్‌ జరిగింది. అప్పటికప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాథన్‌ ఆస్టల్‌ సెంచరీతో మెరిశాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఇది అప్పటి వరకు వన్డే క్రికెట్‌లో మూడవ అత్యధిక స్కోరు. ఇక మరికాసేపట్లో  టీమిండియా ఇన్నింగ్స్‌ ప్రారంభమవుతుందనగా గ్యాలరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

1996 ప్రపంచ కప్ పోటీల కోసం స్టేడియాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం ఈస్ట్‌ పెవిలియన్‌లో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించారు. అయితే మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్‌లో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. ఇంతలో, కొత్తగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో థిలాల కింద చాలా మంది చిక్కుకునిపోయారు. ఈ షాకింగ్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. అదే సమయంలో 60 మందికి పైగా ప్రేక్షకులు తీవ్రంగా గాయపడ్డారు.

అందుకే కొనసాగించారు..

ఈ ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినప్పటికీ నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేయలేదు. ఆ విషయాన్ని ఆటగాళ్లకు కూడా చెప్పలేదు. దీంతో యథావిధిగా భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. మ్యాచ్‌ను రద్దు చేస్తే ప్రేక్షకులు హంగామా చేస్తారని, దీంతో పెద్దఎత్తున అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని మ్యాచ్‌ను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. 349 పరుగులు లక్ష్య ఛేదనలో భారత జట్టు 40 ఓవర్లలో కేవలం 249 పరుగులకే ఆలౌటైంది. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున అత్యధికంగా 65 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి