IND vs NZ: తీరుమారని టీమిండియా.. కివీస్‌లోనూ తేలిపోయిన బౌలర్లు.. లోపం ఎక్కడుందో మరి?
కివీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో లోపం ఎక్కడ జరిగింది.? మన యంగ్ తరంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నా.. బౌలింగ్‌లో తేలిపోయింది. ఆ విభాగంలో పెద్దగా ప్రభావం చూపకపోవడమే దీనంతటికీ కారణంగా చెప్పాలి.
ఓపెనర్లు రాణించారు.. మిడిలార్డర్ బాగానే ఆడింది. చివర్లోమెరుపులు అదిరిపోయాయి. స్కోర్ బోర్డుపై 300ప్లస్ స్కోరు ఉంది. అయినా ఓడిపోయాం. ప్రత్యర్థుల టాప్ ఆర్డర్‌ను అడ్డుకున్నా.. ఎక్కడో బెడిసికొట్టింది. ఎందుకిలా అయింది. కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్లో లోపం ఎక్కడ జరిగింది. మన యంగ్ తరంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నా.. బౌలింగ్‌లో తేలిపోయింది. ఆ విభాగంలో పెద్దగా ప్రభావం చూపకపోవడమే దీనంతటికీ కారణంగా చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో సీనియర్ ధావన్, యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీలతో రాణించారు. వికెట్ కఠినంగా ఉండడంతో నెమ్మదిగా ఆడారు. ఫస్ట్ వికెట్‌కు 124 రన్స్ జోడించాక వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అయ్యర్ పంత్ నిలదొక్కుకుంటున్నారన్న సమయంలో.. మళ్లీ డబుల్ బ్లో. పంత్, ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ ఒకే ఓవర్లో వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత శాంసన్, అయ్యర్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. శ్రేయస్ 80 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే చివర్లో వాషింగ్‌టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా స్కోర్ బోర్డును 300 దాటించాడు.
తర్వాత బ్యాటింగ్‌కి దిగిన కివీస్ ఛేజింగ్‌లో ముందు తడబడినా తర్వాత తేరుకుంది. ఫిన్ అలెన్, కాన్వే, డారెల్ మిచెల్ తక్కువ స్కోర్లే చేశారు. కాని 3 వికెట్లు పడిన తర్వాత దిగిన విలియంసన్, టామ్ లాథమ్ మనోళ్లను ఒక ఆడాడుకున్నారు. ముందు నెమ్మదిగానే ఆడినా.. నిలదొక్కుకున్నాక దంచి కొట్టారు. ముఖ్యంగా లాథమ్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఠాకూర్ వేసిన ఓవర్లో 23 పరుగులు రావడంతో.. 76 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు లాథమ్. ఆతర్వాత కూడా అదే జోరు కొనసాగించడంతో కివీస్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. లాథమ్ 5 సిక్సులు, 19 ఫోర్లతో 145 రన్స్ చేశాడు. విలియంసన్ 94రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
ఇలాగైతే కష్టమే..
కాగా పేస్ బౌలింగ్ లోపం క్లియర్‌గా కనిపించింది. టీ20ల్లో రాణించిన అర్ష్ దీప్ ఇక్కడ ఆకట్టుకోలేకపోయాడు. ఉమ్రాన్ వికెట్లు తీసినా.. పరుగులు సమర్పించుకున్నాడు. శార్దూల్, చాహల్ కూడా అదే రేంజ్‌లో రన్స్ సమర్పించుకోవడం వల్ల మనోళ్లకు ఓటమి తప్పలేదు. టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తోంది. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ అదే రకమైన పెర్ఫామెన్స్ ఇచ్చి ఓటమి పాలైంది. ఇంకెప్పుడు మారతారని ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో ఈ సీరిస్ యువకులకు కీలకంగా మారింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అక్కడ బౌలర్లు, మిడిలార్డర్ పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.
That’s that from the 1st ODI.
New Zealand win by 7 wickets, lead the series 1-0.
Scorecard – https://t.co/JLodolycUc #NZvIND pic.twitter.com/HEtWL04inV
— BCCI (@BCCI) November 25, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..