Virat Kohli: పూమా.. వీడెవడో అచ్చేసినట్టు నాలాగే ఉన్నాడు! కాస్త చూసుకోండి..

మనుషులను పోలిన వాళ్లు ఈ లోకంలో ఏడుగుకు ఉంటారని అంటుంటారు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటుంటాయి. తాజాగా టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీకి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే..

Virat Kohli: పూమా.. వీడెవడో అచ్చేసినట్టు నాలాగే ఉన్నాడు! కాస్త చూసుకోండి..
Virat Kohli Lodges Complaint To Puma
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 25, 2022 | 9:43 PM

మనుషులను పోలిన వాళ్లు ఈ లోకంలో ఏడుగుకు ఉంటారని అంటుంటారు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటుంటాయి. తాజాగా టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీకి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముంబాయ్‌లో అచ్చం తనలాగే ఉన్న ఓ వ్యక్తి పూమా ఉత్పత్తులను అమ్మాడాన్ని కోహ్లీ గమనించాడు. ఈ క్రమంలో కోహ్లీ లాగే డ్రెస్‌ వేసుకుని, అదే హెయిర్‌ స్టైల్‌లో ఉన్న డూప్లికేట్‌ వ్యక్తితో అక్కడికి వచ్చిన వారు ఫొటోలు కూడా దిగారు. ఇది గమనించిన కోహ్లీ పుమా ఇండియాకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సమాచారం అందించారు. హే పుమా ఇండియా.. అచ్చం నాలాగే ఉన్న ఓ వ్యక్తి ముంబైలోని లింక్‌రోడ్డు ద‌గ్గర పుమా ఉత్పత్తులు అమ్ముతున్నాడు. ద‌య‌చేసి గమనించండంటూ కోహ్లి పుమా కంపెనీని ట్యాగ్‌ చేసి, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ డూప్లికేట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నిజానికి.. జర్మన్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ అయిన పూమా బ్లాక్ ఫ్రైడే అమ్మకాల్లో భాగంగా చేసిన ప్రొమోషన్‌ స్టంట్‌ ఇది. స్వయంగా పూమా కంపెనీనే ఇదంతా ప్లాన్‌ చేసింది. పూమా బ్రాండ్ అంబాసిడర్లు అయిన విరాట్ కోహ్లీ, కరీనా కపూర్, సునీల్‌ ఛెత్రి, యువరాజ్‌సింగ్‌..లకు సంబంధించిన డూప్లికేట్‌ వ్యక్తులతో ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లలో సేల్స్ చేపట్టింది. ఇదంతా తెలియక.. పాపం కోహ్లీ కంగారుపడిపోయారు. ఇక యువరాజ్‌సింగ్‌ కూడా కోహ్లీ లాగే కంగారుపడి తన ఇన్‌స్టా ఖాతాలో పూమా కంపెనీకి సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.