IIBF Recruitment 2022: నెలకు రూ.91,300ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..

ముంబాయిలోని ఇండియన్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌.. 10 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IIBF Recruitment 2022: నెలకు రూ.91,300ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..
IIBF Mumbai
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 25, 2022 | 5:50 PM

ముంబాయిలోని ఇండియన్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌.. 10 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్‌ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, ఎంకాం/ఎకనామిక్స్‌లో ఎంఏ/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 1, 2022వ తేదీనాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 30, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా రూ.700లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 17వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.28,300ల నుంచి రూ.91,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 200ల మార్కులకు 200ల మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 140 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రీజనింగ్‌, ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, క్వాంటిటేవిట్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌, కంప్యూటర్ నాలెడ్జ్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 చొప్పున నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో