NIFT Recruitment 2022: ఫ్యాషన్ రంగంలో కొలువులు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా జాబ్ కొట్టవచ్చు..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ఒప్పంద/డిప్యుటేషన్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ఒప్పంద/డిప్యుటేషన్ ప్రాతిపదికన 9 ప్రాజెక్ట్ ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్/కామర్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/కంపెనీ సెక్రేటరీ/కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/సీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోపు (డిసెంబర్ 10) పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో జనరల్ అభ్యర్ధులు రూ.1,180లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/నిప్ట్ ఉద్యోగులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,600ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
The Registrar, NIFT Campus, Hauz Khas, Near Gulmohar Park, New Delhi- 110016.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.