DMHO Ananthapuramu Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో అనంతపురం జిల్లాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ 151 స్పెషలిస్ట్ డాక్టర్స్‌, జనరల్ ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

DMHO Ananthapuramu Jobs 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో అనంతపురం జిల్లాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..
DMHO Ananthapuramu Recruitment 2022
Follow us

|

Updated on: Nov 24, 2022 | 6:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ 151 స్పెషలిస్ట్ డాక్టర్స్‌, జనరల్ ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎండీ, డీఎన్‌బీ, డీఏ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్‌ 25, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.12,000ల నుంచి రూ.1,10,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • స్పెషలిస్ట్ – ఓబీజీ పోస్టులు: 10
  • జనరల్ ఫిజీషియన్ పోస్టులు: 4
  • స్పెషలిస్ట్- కార్డియాలజిస్ట్ పోస్టులు: 1
  • స్పెషలిస్ట్- అనెస్తీటిస్ట్‌ పోస్టులు: 1
  • కన్సల్టెంట్ మెడిసిన్ పోస్టులు: 1
  • స్పెషలిస్ట్- పీడియాట్రిషియన్ పోస్టులు: 1
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 50
  • ఆడియాలజిస్ట్/ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 1
  • క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు: 2
  • న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టులు: 1
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 29
  • మల్టీరిహాబిటేషన్ వర్కర్స్ పోస్టులు: 3
  • ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 4
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 2
  • బ్లడ్ బ్యాంక్/ బ్లడ్ స్టోరేజ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 5
  • డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు: 1
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ అకౌంటెంట్ పోస్టులు: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 8
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్- ఫ్లోరోసిస్ ల్యాబ్ పోస్టులు: 1
  • ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 8
  • అటెండర్ కమ్ వార్డ్ క్లీనర్ పోస్టులు: 1
  • కుక్ కమ్ కేర్ టేకర్ పోస్టులు: 1
  • హాస్పిటల్ అటెండెంట్ పోస్టులు: 2
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు: 7

అడ్రస్:

The District Medical & Health Officer, Prakasam District, Ananthapuramu, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.