AP RGUKT: నవంబర్‌ 27న ఏపీ ట్రిపుల్‌ఐటీ తుది కౌన్సెలింగ్‌.. వెబ్‌సైట్‌లో కాల్‌లెటర్లు..

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో 202-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫేజ్-4 కౌన్సెలింగ్‌కు అర్హులైన..

AP RGUKT: నవంబర్‌ 27న ఏపీ ట్రిపుల్‌ఐటీ తుది కౌన్సెలింగ్‌.. వెబ్‌సైట్‌లో కాల్‌లెటర్లు..
RGUKT AP Final Phase counselling
Follow us

|

Updated on: Nov 24, 2022 | 2:54 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో 202-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫేజ్-4 కౌన్సెలింగ్‌కు అర్హులైన అభ్యర్ధుల జాబితా బుధవారం (నవంబర్‌ 23) విడుదలైంది. కాగా ఈ నాలుగు క్యాంపస్‌లలో 4,400 సీట్లు ఉండగా, గతంలో నిర్వహించిన మూడు కౌన్సెలింగ్‌లకు 44,208 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం దాదాపు 125 సీట్లు (జనరల్‌ కోటాలో 120, ఎన్‌సీసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్‌ కోటా 1 సీట్లు) మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్లకు నవంబరు 27న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఫేజ్‌ 4 కౌన్సెలింగ్‌ కింద భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్‌సీసీ, క్యాప్‌, ఓహెచ్‌ కోటా సీట్లను సైతం నాలుగో దఫా కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా సూచించింది.

కాగా ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు మిగిలిపోవడం, నాలుగు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా ప్రతియేటా మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లన్నీ భర్తీ అయ్యేవి. మిగిలిన సీట్లకు రెండో విడతలో చేరిపోయేవారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో డైన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో