AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది కోసం కఠినమైన నిబంధనలు.. పురుషులకంటే స్త్రీకు భారీ లిస్ట్

ఎయిర్ ఇండియా మహిళా సిబ్బందికి కూడా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా సిబ్బంది కోసం రూపొందించిన కొత్త నిబంధనల జాబితా పురుషుల కంటే పెద్దది. 

Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది కోసం కఠినమైన నిబంధనలు.. పురుషులకంటే స్త్రీకు భారీ లిస్ట్
Air India
Surya Kala
|

Updated on: Nov 24, 2022 | 1:02 PM

Share

టాటా సంస్థ ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న తర్వాత తన క్యాబిన్ క్రూ అటెండర్ల కోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. తాజాగా  క్యాబిన్ సిబ్బంది వస్త్రధారణ ధారణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎయిర్ ఇండియా పరివర్తన ప్రణాళికను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది కోసం కొత్త గ్రూమింగ్ నియమాలను రూపొందించింది. ఒక నెల క్రితం సమగ్ర జాబితాను జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది  వ్యక్తిగత వస్త్రధారణ ప్రమాణాలలో కొన్ని ముఖ్యమైన మార్పులను తెలియజేసింది.

మగ క్యాబిన్ సిబ్బందికి కొత్త నియమాలు: 

*హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. * బట్ట తల ఉన్నవారు లేదా జుట్టు బాగా రాలుతున్నా తప్పనిసరిగా జుట్టుని పూర్తిగా తొలగించుకోవాలి.  అంటే జట్టు తీసుకుని గుండెతో విధులకు హాజరుకావాలి. *బట్టతల కనిపించవద్దు అనుకునే జెంట్స్  క్యాబిన్ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ తలని నున్నగా షేవ్ చేసుకోవాలి. * ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రూ కట్ అనుమతించబడదు. ఇలా క్రూ కట్ తో డ్యూటీకి వస్తే క్యాబిన్ లోకి అనుమతించరు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ ఇండియా మహిళా సిబ్బందికి కూడా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళా సిబ్బంది కోసం రూపొందించిన కొత్త నిబంధనల జాబితా పురుషుల కంటే పెద్దది.

*మహిళా సిబ్బంది ముత్యాల చెవి రింగులు ధరించకూడదు. బంగారం లేదా డైమండ్ గుండ్రని చెవిపోగులు ధరించవచ్చు. అందులో ఎలాంటి డిజైన్ ఉండకూడదు.

*చీరతో పాటు బిందీని కలిగి ఉండటం ఐచ్ఛికం. బిందీ పరిమాణం 0.5 సెం.మీ కంటే ఎక్కువ ఉండకూడదు.

*మహిళా సిబ్బంది చేతికి ఒక కంకణాన్ని మాత్రమేధరించడానికి అనుమతినిచ్చారు. ఈ కంకణంలో ఎలాంటి డిజైన్ రాళ్లు ఉండకూడదు.

* వేళ్ళకు  1 సెం.మీ కంటే పెద్ద ఉంగరం ధరించడానికి అనుమతి లేదు. ఒక చేతికి ఒక ఉంగరం మాత్రమే ధరించడానికి అనుమతినిచ్చారు.

*మహిళా సిబ్బంది ఎక్కువ లేదా చాలా తక్కువ బన్నుతో ఉన్న కేశాలంకరణ అనుమతించబడదు. అంతేకాదు ఈ బన్ను కోసం జుట్టుకి నాలుగు బాబీ పిన్స్ మాత్రమే ఉపయోగించాలి.

*ఎయిరిండియా కొత్త రూల్స్‌లో డ్రెస్‌కోడ్‌, అన్నీ వివరంగా ఇచ్చారు.

*ఐషేడ్స్, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, హెయిర్ షేడ్స్ కార్డుల నిబంధనలను అనుసరించి కచ్చితంగా పాటించాలి.

*డ్యూటీ సమయంలో చీర లేదా ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌ ఏదైనా సరే చెప్పులు ధరించడం తప్పనిసరి. చెప్పులు రంగు చర్మం రంగుతో సరిపోలాలి.

ఈ నిబంధనలను కూడా పాటించాలి:  జుట్టు తెల్లగా మారుతుంటే స్త్రీ, పురుష సిబ్బంది క్రమం తప్పకుండా రంగు వేసుకోవాలి. జుట్టుకు రంగు వేయడానికి ఫ్యాషన్ కలర్ లేదా గోరింటాకు  వేయకూడదని ఎయిర్ ఇండియా నిబంధనలలో పేర్కొంది. అంతేకాదు చేతి, మెడ లేదా చీలమండ చుట్టూ నలుపు లేదా మతపరమైన దారం ధరించడం కూడా నిషేధించబడింది.  డ్యూటీ ముగిసిన అనంతరం సిబ్బంది యూనిఫాం లేదా దాని ఉపకరణాలు ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..