JEE Mains: జేఈఈ మెయిన్స్ పై గందరగోళం.. ట్విట్టర్ కు చేరిన రగడ.. ట్రెండింగ్ లో హ్యాష్ ట్యాగ్..

జనవరిలోనే జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష. అదేంటి అధికారికంగా ఎక్కడ చెప్పలేదు కద అంటారా..? చెప్పలేదు కానీ.. ప్రస్తుతం జేఈఈ కి ప్రిపేర్‌ అయ్యే అందరు విద్యార్థులందరినీ ఈ ప్రశ్న తొలచివేస్తోంది. మరి అత్యంత...

JEE Mains: జేఈఈ మెయిన్స్ పై గందరగోళం.. ట్విట్టర్ కు చేరిన రగడ.. ట్రెండింగ్ లో హ్యాష్ ట్యాగ్..
TS Inter Exam
Follow us

|

Updated on: Nov 24, 2022 | 6:43 AM

జనవరిలోనే  జేఈఈ మెయిన్స్  తొలి విడత పరీక్ష. అదేంటి అధికారికంగా ఎక్కడ చెప్పలేదు కద అంటారా..? చెప్పలేదు కానీ.. ప్రస్తుతం జేఈఈ కి ప్రిపేర్‌ అయ్యే అందరు విద్యార్థులందరినీ ఈ ప్రశ్న తొలచివేస్తోంది. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జేఈఈ మెయిన్స్ పరీక్షపై ఈ అనుమానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వచ్చే జనవరిలో తొలి విడత పరీక్ష జరుగుతుందో లేదో తెలియదు కానీ.. జనవరిలో పరీక్ష పెట్టొద్దు అని ట్విట్టర్ల పెద్ద దుమారమే రేగుతోంది. జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశం లేదని, వచ్చే వారంలో పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, జేఈఈ మెయిన్‌ 2023 తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈనెల 30లోగా నోటిఫికేషన్‌ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుకానుంది.

అయితే, ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్‌ నోట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. దీంతో అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు జనవరిలో ఈ పరీక్షలు నిర్వహించొద్దంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్‌టీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు.

జనవరి, ఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం కుదరదంటున్నారు. అలాగే, 12వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ #Jee mains in april హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి