Ayyappa Mala: అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్లోకి నో ఎంట్రీ.. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి స్కూల్ యాజమాన్యం
యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇదెలా సాధ్యమంటూ హెడ్మాస్టర్ ను ప్రశ్నించారు ధార్మిక సంఘాల వారు. ఎవరెన్ని చెప్పినా..
అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని ఒక విద్యార్ధిని క్లాసులోకి అనుమతించలేదు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా, మందమరి సింగరేణి హైస్కూల్లో జరగింది. తేజ అనే విద్యార్ది అయ్యప్ప మాల వేశాడని స్కూల్ హెడ్ మాస్టర్.. క్లాసులోకి రానివ్వలేదు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగాయి హిందూ ధార్మిక సంఘాలు. తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకుని..స్కూలుకు వెళ్లాయి. స్కూలుకు వచ్చిన హిందూ ధార్మిక సంఘాలు.. యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇదెలా సాధ్యమంటూ హెడ్మాస్టర్ ను ప్రశ్నించారు ధార్మిక సంఘాల వారు. ఎవరెన్ని చెప్పినా స్కూలు నియమాలను ఉల్లంఘించలేమన్నది స్కూలు నిర్వాహకుల వాదన. ఏది ఏమైనా.. అయ్యప్ప మాల ధారణ చేసిన విద్యార్దులను తాము స్కూల్లోకి అనుమతించేది లేదని తెగేసి చెప్పారు స్కూలు నిర్వాహకులు. దీంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారు హిందూ సంఘాల వారు.
ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో మరో ఘటన. స్థానిక ఇన్ ఫ్రాట్ జీసస్ స్కూలు యాజమాన్యం తీరు తీవ్ర కలకలం రేపింది. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న ఇద్దరు విద్యార్ధులను స్కూల్లోకి అనుమతించేది లేదంటూ.. హుకుం జారీ చేశారు స్కూలు నిర్వాహకులు. యూనీఫామ్ లోనే రావాలంటూ.. కరాకండిగా చెప్పారు. దీంతో బాల స్వాములు.. నిన్న యూనిఫామ్ తోనే స్కూలుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాల వారు.. స్కూలుకు వచ్చి.. యూనిఫాం తీయించి.. మేం చూస్కుంటాం.. మీరు మాత్రం స్వామి డ్రెస్సులోనే రమ్మంటూ విద్యార్ధులకు చెప్పారు.
ఈ విషయంపై మండల విద్యాధికారికి ఫిర్యాదు చేసి.. దర్యాప్తు చేయించారు. అయితే ఈ ఘటనలో తప్పు తమదేనని అంగీకరించింది స్కూలు యాజమాన్యం. అధికారులు చెప్పినట్టుగా.. మాలధారణలో పిల్లల్ని అనుమతిస్తామని ఒప్పుకున్నారు. మత ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను కించపరుస్తున్న స్కూలుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హింధూ ధార్మిక సంస్థలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం