Avatar2: హైదరాబాద్ ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద తెరపై విజువల్ వండర్ చూసే చాన్స్

వరల్డ్ సినిమా... త్వరలో బిగ్ విజువల్ వండర్‌ను చూసేందుకు రెడీ అవుతోంది. దాదాపు 13 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన... ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ రిలీజ్ కానుంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రేక్షకులకు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అందించ‌టానికి... హైద‌రాబాద్‌లోని ప్రసాద్‌ ఐ మ్యాక్స్ రెడీ అయ్యింది.

Avatar2: హైదరాబాద్ ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద తెరపై విజువల్ వండర్ చూసే చాన్స్
largest movie screen in Hyderabad’s Prasads
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2022 | 8:59 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌2’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది. అవతార్‌… వెండితెర మీద ఆవిష్కరించిన వింత ప్రపంచం. అప్పటి వరకు సినిమాల్లో కనిపించిన ఏలియన్స్‌కు భిన్నంగా సరికొత్తగా మరో గ్రహపు జీవులను తెర మీద చూపించారు డైరెక్టర్‌. వింత మనుషులు…. అబ్బుర పరిచే లొకేషన్లు… వావ్ అనిపించే ట్విస్ట్‌లతో తెరకెక్కిన అవతార్… వరల్డ్ సినిమా మేకింగ్ స్టైల్‌ను… మార్కెట్‌ స్పాన్‌ను మార్చేసింది.

తాజాగా అవతార్‌ సీక్వెల్‌… ది వే ఆఫ్ వాటర్ మూవీని అండర్ వాటర్‌లో… ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా చిత్రీకరించారు. ఈ సినిమా కోసం నటీనటులను, సాంకేతిక నిపుణులను అండర్ వాటర్‌లో ఉండేలా… రెండేళ్లపాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సినిమాను అమెరికాలోని కాలిఫోర్నియాలో మాన్‌హాట్టన్ బీచ్‌లో షూటింగ్‌ చేశారు. అండర్ వాటర్‌లో చిత్రీకరించిన సీన్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి. అవతార్ 2 సినిమాను 250 మిలియన్ డాలర్ల వ్యయంతో.. 2041 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అవతార్ 2 సీక్వెల్ తర్వాత అవతార్ 3 2024 డిసెంబర్ 20న, అవతార్ 4 డిసెంబర్ 18, 2026న, అవతార్ 5 డిసెంబర్ 22, 2028 తేదీన రిలీజ్‌కు సిద్ధం చేశారు. సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం అవతార్‌ సినిమానే..!!

ఈ సినిమాను 2020లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ.. కోవిడ్ పరిస్థితుల కారణంగా.. అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమాను డిసెంబర్ 16 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. సీక్వెల్ వ‌చ్చి చాలా కాల‌మే అయినా అంచ‌నాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే విడుద‌లైన ట్రైల‌ర్.. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. ‘అవతార్ 2’ త్రీడీ టెక్నాల‌జీతో పాటు 4DX టెక్నాలజీతోనూ రూపొందిన చిత్రం కావ‌టంతో … ప్రేక్షకులకు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అందించ‌టానికి… హైద‌రాబాద్‌లోని ప్రసాద్‌ ఐ మ్యాక్స్ రెడీ అయ్యింది.

ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌తో థియేట‌ర్‌ను ప్ర‌సాద్ ఐ మ్యాక్స్ సిద్ధం చేసింది. 64 అడుగుల పొడ‌వు.. 101 అడుగుల వెడ‌ల్పున్న ఈ థియేట‌ర్‌లో ముందు అవ‌తార్ 2ను ప్రదర్శించబోతున్నారు. కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం అవతార్‌ 2 సినిమా టికెట్‌ బుక్కింగ్స్‌ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈచిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్‌ 3డీ, 4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌లలోనూ విడుదల చేస్తున్నారు. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’ ఎలా ఉండబోతుందో ట్రైలర్‌ ద్వారా హింట్‌ ఇచ్చారు డెరెక్టర్‌. ఇప్పటికే ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. మరి విడుదలకు ముందే వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
ఈ అమ్మాయి డాక్టర్ ఆ.. ? సింగర్ కమ్ హీరోయిన్..
ఈ అమ్మాయి డాక్టర్ ఆ.. ? సింగర్ కమ్ హీరోయిన్..
అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు.. బీజేపీ చీఫ్ నడ్డా సంచలన ట్వీట్
అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు.. బీజేపీ చీఫ్ నడ్డా సంచలన ట్వీట్
బ్రిస్బేన్ టెస్టు డ్రా.. డబ్ల్యుటిసి ఫైనల్‌కు భారత కష్టమేనా..?
బ్రిస్బేన్ టెస్టు డ్రా.. డబ్ల్యుటిసి ఫైనల్‌కు భారత కష్టమేనా..?
ఇదేం విధేయతరా సామీ..! బాస్‌కు సాష్టంగా నమస్కరిస్తున్న ఉద్యోగులు..
ఇదేం విధేయతరా సామీ..! బాస్‌కు సాష్టంగా నమస్కరిస్తున్న ఉద్యోగులు..
అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?
అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?
అందానికే అసూయ పుట్టిస్తోన్న బేబమ్మ..
అందానికే అసూయ పుట్టిస్తోన్న బేబమ్మ..
అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ వెనక కారణాలేంటి? వారి ఒత్తిడితోనే..
అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ వెనక కారణాలేంటి? వారి ఒత్తిడితోనే..
కట్టెల కోసం వెళ్లిన యువతి..ఎంతకీ రాకపోవడంతో అడవిలోకి వెళ్లి చూడగా
కట్టెల కోసం వెళ్లిన యువతి..ఎంతకీ రాకపోవడంతో అడవిలోకి వెళ్లి చూడగా
కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా .!
కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా .!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..