AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వనున్నారు.
పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. ఈమేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వనున్నారు. అయితే ఆన్సర్ బుక్‌లెట్లు మాత్రం రెండూ ఇవ్వనున్నారు. ఒక దానిలో భౌతికశాస్త్రం, మరో దానిలో జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ రెండు సబ్జెక్టుల పేపర్లను వేర్వేరుగా పీఎస్, బీఎస్ టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున రెండు వేర్వేరు ఆన్సర్ బుక్‌లెట్లు ఇవ్వనున్నారు.
రేపటి నుంచే ఫీజు చెల్లింపులు..
ఇక టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా శుక్రవారం (నవంబర్25) డిసెంబర్ 10తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 11 నుంచి 20 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 26 నుంచి 30వతేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో పరిశీలించుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.