Genpact Jobs: డిగ్రీ అర్హతతో సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగాలు.. జెన్పాక్ట్ హైదరాబాద్‌లో ఖాళీలు..
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ జెన్పాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉన్న ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ జెన్పాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఉన్న ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కేవలం మాట్లాడడంలోనే కాకుండా రాయడంలోనూ మంచి నైపుణ్యం ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. కస్టమర్ హాండ్లింగ్, కొత్త విషయాలను నేర్చుకునే ఉత్సాహం ఉండాలి.
ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే క్రమంలో విద్యార్హతలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక జెన్పాక్ట్ కంపెనీ విషయానికొస్తే.. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో సుమారు 800 మంది క్లైంట్స్ ఉన్నారు. ఇక భారత్‌లో జెన్పాక్ట్ క్యాంపస్‌లు బెంగళూరు, గోర్గావ్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నోయిడాతో పాటు హైదరాబాద్‌లో పోచారం, ఉప్పల్‌లో ఉన్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..