AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అధిక ఫీజులు వసూలు చేస్తున్న 24 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులు.. రుజువైతే భారీ జరిమానా..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తన్న 24 ఇంజినీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. సర్కార్ నిర్ణయించిన..

Telangana: అధిక ఫీజులు వసూలు చేస్తున్న 24 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులు.. రుజువైతే భారీ జరిమానా..
TAFRC sent notices to Pvt Engineering Colleges
Srilakshmi C
|

Updated on: Nov 24, 2022 | 3:21 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తన్న 24 ఇంజినీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. సర్కార్ నిర్ణయించిన ట్యూషన్‌ ఫీజులను మించి, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కమిటీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై వెంటనే సమాధానం ఇవ్వాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. కన్వీనర్‌ కోటా సీట్లకు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా కన్వీనరే వసూలు చేయడం జరుగుతుంది. అందులో అధికంగా వసూలు చేసే అవకాశం లేదు. ఇక ప్రత్యక ఫీజుల కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.5,500లు మాత్రమే వసూలు చేయాలి.

ఐతే ఇంజనీరింగ్‌ కాలేజీలు రూ.5,500లకు బదులు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవల్సిందిగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా అధికశాతం ఎందుకు వసూలు చేస్తున్నారంటూ, వివరణ కోరుతూ కమిటీ నోటీసులు జారీచేసింది. కొన్ని కాలేజీలు దీనిపై ఇప్పటికే వివరణలు పంపాయి. స్పందించని కాలేజీ యాజమన్యాలను కమిటీ కార్యాలయానికి పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాటి వివరణతో కమిటీ సంతృప్తి చెందని పక్షంలో, ఒక్కోకాలేజీకి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా దాదాపు 159 ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫిక్స్‌డ్‌ ట్యూషన్‌ ఫీజును నిర్ణయిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో జీవో37ను జారీ చేసింది. అలాగే రాష్ట్ర సర్కార్ సైతం ఇంటర్‌నెట్‌, రీడింగ్‌ రూం, కంప్యూటర్ వంటి సేవలకు ఫీక్స్‌డ్‌ ఫీజు నిర్ణయించింది. నిబంధనలను మీరి ఫీజులు వసూలు చేసిన కాలేజీలకు జరిమానా విధిస్తామని హెచ్చరించినప్పటికీ కొన్ని కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.