NTR Trust Gest 2023 Scholarship: పదో తరగతి బాలికలకు గుడ్‌న్యూస్! ఎన్టీఆర్ ట్రస్ట్ 2023 స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం..
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికా విద్యా స్కాలర్‌షిప్ పరీక్ష (జీఈఎస్‌టీ) -2023కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన విద్యార్ధినులకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి..
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికా విద్యా స్కాలర్‌షిప్ పరీక్ష (జీఈఎస్‌టీ) -2023కు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్షలో ప్రతిభకనబరచిన విద్యార్ధినులకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నవంబరు 23న ప్రకటన విడుదల చేశారు. క్లాట్, ఐపీఎం, జేఈఈ-మెయిన్, నీట్, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్ధినులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. 2022-23 విద్యాసంవత్సరానికి పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ లో నవంబర్ 30, 2022వ తేదీలోపు అన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాల నివృతి కోసం 7660002627/28 నంబర్‌లను సంప్రదించవచ్చు.
స్కాలర్‌షిప్ వివరాలు..
జీఈఎస్‌టీ -2023 పరీక్ష డిసెంబర్ 4వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5,000లు చొప్పున, ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్ రెండేళ్లు పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం అందుతుంది.
రాత పరీక్ష విధానం..
మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులకుగానూ.. 2 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.