గద్ద ముక్కు పెరిగిపోతే అది రాళ్లకేసి కొట్టుకుని, ముక్కు విరగగొట్టుకుంటుందని, కొంతకాలానికి తిరిగి డేగ ముక్కు పెరిగుతుందని అనుకుంటారు. నిజానికి.. డేగ మాత్రమేకాడు ఏ పక్షికైనా చిన్నగాయం తగిలితే కొంతకాలానికి అది నయం అవుతుంది. అదే ముక్కు విరగడం వంటివి జరిగితే అవి బతికినంతకాలం అంగవైకల్యంతోనే ఉంటాయి తప్ప కెరాటిన్ తిరిగి పెరిగే అవకాశం ఉండదని టాడ్ కాట్జ్నర్ తన బుక్‌లో పేర్కొన్నారు.