APPSC Group 1 Topper: ‘ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు దాని పైనే ఆధారపడి ఉంటాయి! అందుకే..జాగ్రత్తగా ఫిల్‌ చేయాలి’

గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలు, వారి అనుభవాలు గ్రూప్‌ 1 ఆశావహులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్‌-1లో టాపర్‌గా నిలిచిన రాణి సుస్మిత విజయ పథం మీకోసం..

APPSC Group 1 Topper: 'ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు దాని పైనే ఆధారపడి ఉంటాయి! అందుకే..జాగ్రత్తగా ఫిల్‌ చేయాలి'
APPSC Group 1 Topper Rani Susmitha
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 24, 2022 | 7:47 PM

ఈ ఏడాది గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదలవ్వగా ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. త్వరలో పరీక్షల తేదీలను కమిషన్‌ విడుదల చేయనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలు, వారి అనుభవాలు గ్రూప్‌ 1 ఆశావహులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్‌-1లో టాపర్‌గా నిలిచిన రాణి సుస్మిత విజయ పథం మీకోసం..

అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌..

రాణి సుస్మిత కాకినాడ జిల్లా పిఠాపురం నివాసి.1 నుంచి 10వ తరగతి వరకు పిఠాపురంలోని ప్రియదర్శిని స్కూల్లో, ఇంటర్మీడియట్, డిగ్రీ కాకినాడ చ‌దివారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన రాణి సుస్మిత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. ఆ తర్వాత బెంగళూరులో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందారు. ఈ క్రమంలో ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతూఉండేవారు.

ఐతే చాలా మంది సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ జాబ్‌లకు కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుని పరీక్షల్లో మెరుస్తుంటారు. ఐతే రాణి సుస్మిత మాత్రం ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌-1కి ప్రిపేరయ్యారు. ఐతే ఫలితాల్లో మొదటి 5 ర్యాంకుల్లో ఒకటి వస్తుందని అనుకుంటే.. ఏకంగా ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో సంతోషం వ్యక్తం చేశారు. రాణి సుస్మిత కుటుంబంలో ఎక్కువ మంది విద్యావంతులు కావడం, భర్త రవికాంత్‌ ప్రోత్సాహకంతో ఇదంతా సాధ్యమైందని తెలిపారు. గతంలో ర్యాంకులు సాధించిన టాపర్ల సూచనలు గ్రూప్స్‌కు ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో రాణి సుస్మితను అడిగిన ప్రశ్నలు ఇవే..

  • గ్రూపు1 ఇంటర్వ్యూ దరఖాస్తులో నమోదుచేసిన వివరాల ఆధారంగానే బోర్డు సభ్యులు ప్రశ్నలు అడిగారు.
  • సెంట్రల్‌ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీల మధ్య ఉన్న వ్యత్యాసం?
  • సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి?
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యత ఏమిటి?
  • పీహెచ్‌డీ చేసి, గ్రూప్స్‌ వైపు ఎందుకొచ్చారు? వంటి ప్రశ్నలు అడిగినట్లు రాణి సుస్మిత తెలిపారు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.