- Telugu News Photo Gallery Business photos What is a credit score? Here are the Advantages of a Good Credit Score
Credit Score: క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు..
ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంక్ డబ్బు వాడుకునే సౌలభ్యం కల్పించేదే క్రెడిట్ కార్డు. ఎవరు తీసుకున్న అప్పు తీరుస్తారు? ఎవరు తీర్చలేరో..? అంచనా వేసి బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణను..
Updated on: Nov 25, 2022 | 7:31 PM

ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంక్ డబ్బు వాడుకునే సౌలభ్యం కల్పించేదే క్రెడిట్ కార్డు. ఎవరు తీసుకున్న అప్పు తీరుస్తారు? ఎవరు తీర్చలేరో..? అంచనా వేసి బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేయడాన్నే క్రెడిట్ రేటింగ్ అని అని అంటారు. క్రెడిట్ రేటింగ్ ఎలా చేస్తారంటే..

కనీసం మూడేళ్ళలో ఎక్కడా క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు ఆలస్యంకాకుండా ఉండాలి. రుణాలు తీసుకున్నవారి క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి హామీ లేకుండా తీసుకునే రుణాలు కాబట్టి వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి కొత్త రుణం ఇస్తే అది తీర్చే అవకాశం తక్కువ అని క్రెడిట్ స్కోరింగ్ సంస్థలు భావిస్తాయి.

తక్కువ వ్యవధిలో వివిధ బ్యాంకులకు కొత్త క్రెడిట్ కార్డ్ దరఖాస్తులు ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు రేటింగ్ ఏజెన్సీల అభిప్రాయం తీసుకుంటాయి.

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ దరఖాస్తులు రేటింగ్ ఏజెన్సీల దగ్గరకు వెళితే మీకు ఏదో పెద్ద అవసరం వచ్చి దరఖాస్తులు పెడుతున్నారని అనుమానించి మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే అవకాశం ఉంది. అందుకే అప్పుడప్పుడూ క్రెడిట్ రిపోర్ట్ చూసుకుంటూ ఉండాలి. ఏవైనా అనుమానాలుంటే రేటింగ్ ఏజెన్సీని సంప్రదించి సరిచూసుకోవాలి.

వ్యయ పరిమితిని దాటి క్రెడిట్ కార్డ్ వాడితే అది క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా రుణాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి.





























