Student Life: నలుగురిలో త్వరగా కలవలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే సరి..
క్లాస్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో అందరూ ఒకేలా ఉండరు. కొందరు త్వరత్వరగా నలుగురితో కలిసిపోతే, మరికొందరేమో కొత్తవారితో మాట్లాడాలంటే విపరీతమైన మొహమాటం, బిడియంతో పరిచయాలనూ పెంచుకోలేక ఇబ్బందిపడిపోతుంటారు..
Updated on: Nov 25, 2022 | 8:47 PM

క్లాస్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో అందరూ ఒకేలా ఉండరు. కొందరు త్వరత్వరగా నలుగురితో కలిసిపోతే, మరికొందరేమో కొత్తవారితో మాట్లాడాలంటే విపరీతమైన మొహమాటం, బిడియంతో పరిచయాలనూ పెంచుకోలేక ఇబ్బందిపడిపోతుంటారు.


ఏవైనా సందేహాలు ఉంటే మనసులోనే పెట్టుకుని ఇబ్బందిపడకుండా అడగడం వల్ల పరిచయాలూ పెరుగుతాయి. అనతికాలంలోనే ఆ పరిచయం స్నేహంగా మారుతుంది.

స్నేహితులు వారి పరిచయస్తులతో బయటకు వెళుతుంటే మీరూ వారి వెంట వెళ్లొచ్చు. దీంతో కొత్తవారితో మీకూ పరిచయం అవుతుంది. మీ అంతట మీరుగా ఇతరులతో కలవలేనప్పుడు ఈ పద్ధతి వల్ల లాభం ఉంటుంది.

అలాగే క్విజ్, ఎస్సే, స్పీచ్ కాంపిటీషన్లలో పాల్గొంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నలుగురితో మాట్లాడటం అలవాటవుతుంది. నిజానికి.. నలుగురిలో కలవలేకపోవడమనేది చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఐతే వారంతా ఈ సమస్యను ఎలా పరిష్కరించగలిగారో తెలుసుకోవాలి. అంతేగానీ.. నేనింతే అని సరిపెట్టుకోకూడదు.





























