Neha Marda: పెళ్లయిన పదేళ్లకు ప్రెగ్నెన్సీ.. సంతోషంలో మునిగితేలుతోన్న చిన్నారి పెళ్లికూతురు నటి

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చూసిన వారికి గెహ్నా పాత్ర తప్పక గుర్తుండిపోతుంది. దాదీ సా పెద్ద కోడలి పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకుంది నేహా మర్దా. తన అద్భుతమైన నటనతో అందరి మనసుల్లో నిలిచిపోయింది నేహా.

Neha Marda: పెళ్లయిన పదేళ్లకు ప్రెగ్నెన్సీ.. సంతోషంలో మునిగితేలుతోన్న చిన్నారి పెళ్లికూతురు నటి
Neha Marda
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 9:27 AM

బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు).. బుల్లితెరపై ఈ సీరియల్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ ధారావాహిక బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సీరియల్‌తో పాటు ఇందులో నటించిన తారలు కూడా బోలెడు క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చూసిన వారికి గెహ్నా పాత్ర తప్పక గుర్తుండిపోతుంది. దాదీ సా పెద్ద కోడలి పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకుంది నేహా మర్దా. తన అద్భుతమైన నటనతో అందరి మనసుల్లో నిలిచిపోయింది నేహా. ఇదిలా అదిరిపోయే శుభవార్త చెప్పిందీ అందాల తార. తాను తల్లికాబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించి తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తోనూ షేర్‌ చేసుకుంది. ఈ సందర్భంగా నేహా తన భర్తతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  బాలీవుడ్ కు చెందిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నేహా దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో పాటు పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది నేహా. బుల్లితెర జీవితంలో బిజీగా ఉండగానే 2012లో ఆయూష్మాన్‌ అగర్వాల్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈనేపథ్యంలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆమె తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నారు. కాగా 2023లో బేబీ తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు పేర్కొంది నేహా. ఈ సందర్భంగా నువ్వునేను ఫేం అనితా హస్సానందిని, రష్మీ దేశాయ్‌, చాందినీ లాంటి బుల్లితెర సెలబ్రిటీలు నేహా దంపతులకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Neha Marda (@nehamarda)

View this post on Instagram

A post shared by Neha Marda (@nehamarda)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!