AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fifa World Cup: మెస్సీని చూసేందుకు మహిళ సాహసం.. ఐదుగురు పిల్లలతో కలిసి కేరళ నుంచి ఖతర్‌కు కారులో సోలో జర్నీ

కేరళకు చెందిన ఓ మహిళ తన అభిమాన ఆటగాడు లియోనెల్ మెస్సీ ని చూసేందుకు కేరళ నుంచి ఖతార్‌కు వెళ్లింది. అది కూడా ఒంటరిగా కారులో ఖతార్‌ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Fifa World Cup: మెస్సీని చూసేందుకు మహిళ సాహసం.. ఐదుగురు పిల్లలతో కలిసి కేరళ నుంచి ఖతర్‌కు కారులో సోలో జర్నీ
Kerala Mother
Basha Shek
|

Updated on: Nov 27, 2022 | 10:59 AM

Share

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్ సంచలనాలు నమోదవుతున్నాయి. స్టార్‌ ఆటగాళ్లతో కూడిన పెద్ద జట్లు చిన్న జట్ల చేతితో చతికిలపడుతున్నాయి. దీంతో ఈ సాకర్‌ ప్రపంచకప్‌కు ఎక్కడ లేని క్రేజ్‌ వస్తోంది. రోజురోజుకూ ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ వీక్షకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇక తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఖతార్ చేరుకుంటున్నారు. క్రికెట్‌కు ఓ మతంగా భావించే భారత్‌లోనూ ఈ గేమ్‌కు క్రేజ్‌ బాగా పెరిగింది. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఈ ఆటను అభిమానించే వారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగామెస్సీ, రొనాల్డోలకు ప్రత్యేక అభిమానులున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ మహిళ తన అభిమాన ఆటగాడు లియోనెల్ మెస్సీ ని చూసేందుకు కేరళ నుంచి ఖతార్‌కు వెళ్లింది. అది కూడా ఒంటరిగా కారులో ఖతార్‌ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేరళకు చెందిన నాజీ నౌషి అనే మహిళ మెస్సీ ఆటతో ప్రేమలో పడి అతన్ని కలవాలని నిర్ణయించుకుని ఈ సాహసానికి పూనుకుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ 33 ఏళ్ల నౌషి ఐదుగురు పిల్లల తల్లి. యూట్యూబ్ వ్లాగర్ అయిన నౌషి తన సొంత కారులో ఖతార్ వెళ్లింది.

ఖలీజ్ టైమ్స్ ప్రకారం, అక్టోబర్ 15 న కేరళ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన నౌషి ఇప్పటికే యూఏఈకి చేరుకుంది. ఇదిలా ఉంటే అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోవడంతో నౌషీ బాగా నిరాశచెందింది. అయితే రెండో మ్యాచ్‌లో మెక్సికోపై గెలుపొందడంతో తెగ సంబరపడిపోతోంది. ‘నా అభిమాన ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. ఇంతలో సౌదీ అరేబియాపై ఓటమి నన్ను నిరాశపరిచింది. కానీ ట్రోఫీని గెలుచుకునే మార్గంలో ఇదొక చిన్న అడ్డంకి మాత్రమే’ అని చెప్పుకొచ్చింది నౌషీ.

ఇవి కూడా చదవండి
Kerala Mother1

Kerala Mother

కారులోనే కిచెన్..

నౌషి తన ఎస్‌యూవీలో కేరళ నుంచి ముంబైకి వెళ్లి ఓడలో ఒమన్ చేరుకుకుంది. మస్కట్ నుండి తన ప్రయాణాన్ని కొనసాగించిన తరువాత, నౌషి హటా సరిహద్దు ద్వారా యూఏఈ చేరుకుంది. తన ప్రయాణ ఖర్చులు కాస్త తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో నౌషి ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి తన కారులో చిన్న కిచెన్‌ని ఏర్పాటుచేసుకుంది. వంటకోసం బియ్యం, నీరు, పిండి, మసాలా పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. ప్రయాణంలో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కారు పైకప్పుపై టెంట్ కూడా ఏర్పాటు చేసింది. కాగా భారత్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆడడం చూడాలని కలలు కంటున్నానని నౌషీ చెబుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..