IND vs PAK: పాక్‌ బెదిరింపులకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన కేంద్రమంత్రి.. సరైన సమయం కోసం వేచి ఉండాలంటూ..

తాజాగా రమీజ్‌ వ్యాఖ్యలపై కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం పెద్ద శక్తి అని, ఏ దేశమూ తమను విస్మరించదంటూ రమీజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఠాకూర్.

IND vs PAK: పాక్‌ బెదిరింపులకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన కేంద్రమంత్రి.. సరైన సమయం కోసం వేచి ఉండాలంటూ..
Anurag Thakur
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2022 | 12:08 PM

బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య దూరం పెరుగుతోంది. ఆసియాకప్‌, ప్రపంచకప్‌లకు సంబంధించి ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారత జట్టును బెదిరించేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. తాజాగా రమీజ్‌ వ్యాఖ్యలపై కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం పెద్ద శక్తి అని, ఏ దేశమూ తమను విస్మరించదంటూ రమీజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాగా వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాను పంపబోమని, అలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్‌ను తటస్థ వేదికగా నిర్వహించాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా గత నెలలో ప్రకటించారు.

దీనికి సంబంధించి బీసీసీఐపై బెదిరింపులకు దిగింది పీసీబీ. టీమిండియా రాకపోతే వచ్చే ఏడాది ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌లో అడుగుపెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ శనివారం పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఈ విషయంపై స్పందించారు. పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లకపోతే, ఎవరూ టోర్నమెంట్‌ను కూడా చూడరన్నారు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ‘సరైన సమయం కోసం వేచి ఉండండి. క్రీడా ప్రపంచంలో భారత్ పెద్ద శక్తి. ఏ దేశమూ భారత్‌ను విస్మరించదు’ అని బదులిచ్చార రాకూర్‌. ఇదిలావుంటే.. 2023 ఆసియాకప్‌లో టీమిండియా ఆడడం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఇర యాదృచ్ఛికంగా, ఈ టీ20 ప్రపంచ కప్ మాదిరిగానే, వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో భారత్ మరియు పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండడం కొసమెరుపు. మరి ఈ వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..