- Telugu News Photo Gallery Cricket photos MS Dhoni fan makes his presence felt at FIFA World Cup 2022 watch photos
MS Dhoni: అట్లుంటది మరి ధోని క్రేజ్ అంటే.. ఫిఫా ప్రపంచకప్‌లోనూ మార్మోగుతోన్న మిస్టర్ కూల్ పేరు
మిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో ధోని ప్రాతినిథ్యం వహిస్తోన్న CSKకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.
Updated on: Nov 27, 2022 | 12:54 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో ధోని ప్రాతినిథ్యం వహిస్తోన్న CSKకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రస్తుతం ఖతార్ వేదికగా జరుగుతోన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోనూ ధోనీ పేరు వినిపిస్తోంది. సీఎస్కే అభిమానులు కొందరు ఫుట్‌బాల్ మైదానంలో ధోని జెర్సీలతో సందడి చేశారు.

బ్రెజిల్-సెర్బియా మ్యాచ్ కొందరు అభిమానులు సీఎస్‌కే, ధోని జెర్సీలతో ఫొటోలు దిగారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసింది. వీటికి 'ఎల్లో ఎవెరీవేర్' అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ధోని క్రేజ్ మాములుగా లేదని ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫుట్‌బాల్ ప్రేమికుడే. అతని అభిమాన ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్. అలాగే ఫుట్‌బాల్ ప్లేయర్ పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో అంటే ధోనికి చాలా ఇష్టం.





























