FIFA World Cup 2022: ఫీఫా ప్రపంచకప్‌లో ఈ రోజు నాలుగు మ్యాచ్‌లు.. ఎలా, ఎక్కడ చూడాలంటే..?
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభమై వారం పూర్తయింది. ఈ వారం రోజులలో టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాయి. ఈ రోజు టోర్నమెంట్‌లోని
ఖతర్ వేదికగా జరుగుతున్న FIFA World Cup 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభమై వారం పూర్తయింది. ఈ వారం రోజులలో టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్లు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాయి. ఈ రోజు టోర్నమెంట్‌లోని నాలుగు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ఫుట్‌బల్ అభిమానులు తాము కోరుకునే యాక్షన్ సీన్‌లు తప్పక చూడగలుగుతారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు సాధించిన జర్మనీ వేర్వేరు మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ రోజు(నవంబర్ 27) గ్రూప్-ఈలో మూడు మ్యాచ్‌లు, గ్రూప్-ఎఫ్‌లో ఒక మ్యాచ్ జరగనున్నాయి.
అయితే తొలి మ్యాచ్ జపాన్-కోస్టారికా మధ్య జరగనుంది. రెండో మ్యాచ్‌లో బెల్జియం జట్టు మొరాకోతో తలపడుతుంది. గతే ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా జట్టు కెనడాతో ఆడనుంది. ఇక నాలుగో మ్యాచ్ స్పెయిన్, జర్మనీ దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసమే అభిమానులు చాలా ఉత్సుకతతో వేచి ఉన్నారు.
ఈ రోజు ఎవరెవరి మధ్య మ్యాచ్‌లు..?
ఆదివారం ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ జపాన్-కోస్టారికా మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ మొరాకో-బెల్జియం మధ్య ఉంటుంది. లూకా మోడ్రిచ్ కెప్టెన్సీలో కెనడా.. క్రొయేషియాతో బరిలోకి దిగనుంది. కాగా చివరి మ్యాచ్ స్పెయిన్-జర్మనీ మధ్య ఆదివారం అర్థరాత్రి జరగనుంది.
నాలుగు మ్యాచ్‌లు ఏయే సమయాలలో..?
తొలి మూడు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం నవంబర్ 27న జరుగుతాయి. మరియు స్పెయిన్-జర్మనీ మ్యాచ్ నవంబర్ 28 న ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం జపాన్, కోస్టారికా మధ్య మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొరాకో, బెల్జియం మధ్య జరగనుంది. ఇక మూడో మ్యాచ్ క్రొయేషియా, కెనడా జట్ల మధ్య రాత్రి 9:30 గంటలకు జరుగుతుంది. ఇక చివరి మ్యాచ్ స్పెయిన్-జర్మనీ దేశాల జట్లతో రాత్రి 12:30 నుండి జరుగుతుంది.
ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి..?
ఈ రోజు జరిగే నాలుగు మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్18, స్పోర్ట్స్18 హెచ్‌డీలో చూడవచ్చు. ఇంకా జియో సినిమా యాప్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..