Ravindra Jadeja: బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఆ సీనియర్ ఆల్‌రౌండర్ ఔట్.. కారణం ఏమిటంటే..?

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న వన్డే, టెస్టు సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. గత ఆసియా కప్ సమయంలో గాయపడిన జడేజా మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఆ కారణంగానే అతను ఇటీవల

Ravindra Jadeja: బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఆ సీనియర్ ఆల్‌రౌండర్ ఔట్.. కారణం ఏమిటంటే..?
Ravindra Jadeja
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 27, 2022 | 7:16 AM

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న వన్డే, టెస్టు క్రికెట్ సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. గత ఆసియా కప్ సమయంలో గాయపడిన జడేజా మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ఆ కారణంగానే అతను ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కనిపించలేదు. అంతేకాక ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అతను లేకపోవడానికి అదే కారణం. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ ద్వారా జడ్డూ పునరాగమనం చేస్తాడని బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ అతను పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేనందున వన్డే జట్టు ఎంపికకు అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో టెస్టు టీమ్‌లో అతని పేరును చేర్చింది బీసీసీఐ. అయితే ఇప్పుడు రవీంద్ర జడేజా టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. పూర్తిగా గాయం నుంచి కోలుకోని అతనికి బదులుగా ఉత్తరప్రదేశ్ ఆటగాడు సౌరభ్ కుమార్‌ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అదనపు ఆటగాడిగా అవకాశం దక్కే అవకాశం ఉంది. ‘‘జడేజా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి టెస్టు సిరీస్‌లో అతను పునరాగమనం చేయడం అనుమానమే. అలాగే ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల బృందం సూచించింది. అందువల్ల టెస్టు జట్టు ఎంపికకు జడేజాను పరిగణనలోకి తీసుకోవడం లేద’’ని సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.

కాగా, డిసెంబర్ 4 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేల సిరీస్, డిసెంబర్ 14 నుంచి 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.

భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్ షెడ్యూల్:

  • డిసెంబర్- 4: మొదటి వన్డే
  • డిసెంబర్- 7: రెండో వన్డే
  • డిసెంబర్- 10: మూడో వన్డే

భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • డిసెంబర్- 14: మొదటి టెస్ట్ మ్యాచ్
  • డిసెంబర్- 22: రెండో టెస్టు మ్యాచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?