IND vs NZ: కివీస్‌తో రెండో వన్డే.. మళ్లీ బెంచ్‌కే పరిమితమైన సంజూ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన టీమిండియా రెండో సమారానికి సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ఇరు జట్ల రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్‌లోనూ ఓడిపోతే సిరీస్ గల్లంతైనట్లే. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ‘వర్షం కారణంగా పిచ్‌పై చాలాసేపు కవర్లు కప్పి ఉంచారు. ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది’ అని టాస్ సమయంలో చెప్పుకొచ్చాడు కేన్. కాగా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. సంజూ శామ్సన్ మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శార్దూల్ ను కూడా తప్పించి దీపక్ హుడా, దీపక్ చాహర్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉన్నాయంటే
టీమిండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, , డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్
? Team News ?
2⃣ changes for #TeamIndia as @HoodaOnFire & @deepak_chahar9 are named in the team. #NZvIND
Follow the match ? https://t.co/frOtF82cQ4
A look at our Playing XI ? pic.twitter.com/MnkwOy6Qde
— BCCI (@BCCI) November 27, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..