Vijay Hazare Trophy: కేకేఆర్ వద్దంది.. కసితో మైదానంలో కుమ్మేశాడు.. సందిగ్ధంలో ఫ్రాంచైజీ..
షారుఖ్ ఖాన్ జట్టు శివమ్ మావితో సహా 16 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. కానీ, ఇప్పుడు ఈ ఆటగాడు విజయ్ హజారే ట్రోఫీలో ముంబైపై అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ శివమ్ మావీని రిలీజ్ చేసింది. వాస్తవానికి, ఐపీఎల్ వేలం 2023 డిసెంబర్ 23న కొచ్చిలో జరగాల్సి ఉంది. అంతకుముందు అన్ని జట్లు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి ఇచ్చేశాయి. షారుఖ్ ఖాన్ జట్టు శివమ్ మావితో సహా 16 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. కానీ, ఇప్పుడు ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
డెడ్లీ బౌలింగ్‌తో ఆకట్టుకున్న శివమ్ మావి..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో శివమ్ మావి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను అందించాడు. ఈ యువ ఫాస్ట్ బౌలర్ ముంబైతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ తరపున 4 వికెట్లు తీశాడు. శివమ్ మావి అద్భుత బౌలింగ్ కారణంగా ముంబై జట్టు కేవలం 220 పరుగులకే కుప్పకూలింది. శివమ్ మావి 9.3 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై ఇన్నింగ్స్ కేవలం 220లకే పరిమితం..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభం చాలా దారుణంగా ఉంది. మూడో బంతికి ఓపెనర్ దివ్యాంష్ సక్సేనాను అంకిత్ రాజ్‌పుత్ అవుట్ చేశాడు. అదే సమయంలో పృథ్వీ షా కొద్దిగా పర్వాలేదనిపించినా.. కెప్టెన్ అజింక్యా రహానే, అర్మాన్ జాఫర్ మధ్య మంచి భాగస్వామ్యం నెలకొంది. కానీ, ఇద్దరు ఆటగాళ్లు ఈ మంచి భాగస్వామ్యాన్ని పెద్ద స్కోర్‌గా మార్చలేకపోయారు. 26 పరుగుల వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. అర్మాన్ జాఫర్ 32 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. షామ్స్ ములానీ, హార్దిక్ తమోర్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. అదే సమయంలో ముంబై జట్టు మొత్తం 48.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..