Virushka: ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న విరుష్క జోడీ.. రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Anushka Sharma- Virat kohli New House: బాలీవుడ్ జంట అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ ముంబైలోని జుహులో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. దీని కోసం ఈ జంట ప్రతినెలా భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

Virushka: ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న విరుష్క జోడీ.. రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Ind Vs Aus Virat Kohli, Anushka Sharma
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2022 | 6:49 AM

బాలీవుడ్ పవర్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి తమ కెమిస్ట్రీతో మాత్రమే కాకుండా, వారి విలాసవంతమైన జీవితానికి సంబంధించి కూడా తరచుగా ముఖ్యాంశాల్లో ఉంటుంటారు. ఖరీదైన వాహనాల నుంచి విలాసవంతమైన ఆస్తుల వరకు కోట్లాది ఆస్తులకు యజమానులైన విరాట్, అనుష్కలు.. ఇటీవల తాజాగా ఈ జంట ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇది చాలా ఖరీదైనదంట.

అనుష్క, విరాట్ కోహ్లీ ముంబైలోని జుహులో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ఫ్లాట్ నెల అద్దె ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ జంట తమ ఫ్లాట్ కోసం ప్రతి నెలా రూ.2.76 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. నివేదికల మేరకు ఈ జంట ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారంట.

ఇవి కూడా చదవండి

అనుష్క-విరాట్ కొత్త ఇల్లు..

లీవ్, లైసెన్స్ ఒప్పందాన్ని యాక్సెస్ చేసిన రియల్ ఎస్టేట్ పోర్టల్‌లోని ఒక నివేదిక ప్రకారం, అనుష్క, మరియు విరాట్ హై టైడ్ భవనం నాల్గవ అంతస్తులో ఉన్న జుహులో 1650 చదరపు అడుగుల సముద్రం ఫేస్ కలిగిన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఫ్లాట్ కోసం దంపతులు ఇప్పటికే రూ.7.50 లక్షలు చెల్లించారంట. దీని ఒప్పందం కూడా 17 అక్టోబర్ 2022న జరిగింది. ఇప్పటి వరకు ఈ ఫ్లాట్ యాజమాన్యం మాజీ క్రికెటర్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్ వద్ద ఉండేది.

ఈ ఖరీదైన ఇళ్లు..

అనుష్క, విరాట్‌లకు ఇళ్లకు కొరత లేదు. తమ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో ఇద్దరికీ తెలుసు. ముంబైతో పాటు, ఈ జంటకు అలీబాగ్, గురుగ్రామ్‌లలో కూడా విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలోని వర్లీలో సముద్రానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. దీని విలువ రూ.34 కోట్లు. ఇక్కడ ఇద్దరూ తమ కుమార్తె వామికా కోహ్లీతో కలిసి నివసిస్తున్నారు. వర్లీతో పాటు, ఈ జంటకు ముంబైలోని వెర్సోవాలో ఫ్లాట్ కూడా ఉంది. ఇప్పుడు వీరి ఖాతాలోకి మరో ఆస్తి చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..