Salman Khan: ఆ ఒక్క కేసు నుంచి బయటపడేందుకు రూ. 25 కోట్లు ఖర్చు చేసిన సల్మాన్ ఖాన్..
2002లో ముంబైలోని బాంద్రాలో సల్మాన్‌ఖాన్‌కు చెందిన కారు రోడ్డుపై నిద్రిస్తున్న పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడున్న చాలా మంది చనిపోయారు. దీంతో ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం తాగి కారు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇటీవల మెగాస్టా్ర్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సల్లూభాయ్. కేవలం వెండితెరపైనే కాకుండా .. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు సల్మాన్. అయితే బీటౌన్‌లో అగ్రకథానాయికుడైనా సల్మా్న్.. ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. అంతేకాదు.. అతడిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. అందులో హిట్ అండ్ రన్ కేసు ఒకటి. ఈ కేసులో సల్మాన్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత ముంబై హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి సలీం ఖాన్ తెలిపారు.
2002లో ముంబైలోని బాంద్రాలో సల్మాన్‌ఖాన్‌కు చెందిన కారు రోడ్డుపై నిద్రిస్తున్న పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడున్న చాలా మంది చనిపోయారు. దీంతో ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం తాగి కారు నడుపుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. 2015లో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన సల్మాన్.. ఆ తర్వాత డిసెంబర్ 2015న బాంబే హైకోర్టులో ఉపశమనం కల్గింది.
ఈ సందర్భంగా సల్మాన్ తండ్రి సలీం ఖాన్ మాట్లాడుతూ.. ఈ కేసు నుంచి బయటపడేందుకు సల్లూభాయ్ రూ. 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ‘అందరూ సంతోషంగా ఉన్నారు. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహితంగా ఉండేవారంతా హప్పీగా ఉన్నారు. సల్మాన్ కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఈ కేసు కోసం ఆయన 20-25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో పాటు చాలా ఒత్తిడికి గురయ్యాడు’ అని తెలిపారు.