Sudheer Babu: సుధీర్ బాబు సినిమాకు హాలీవుడ్ టచ్.. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా..

భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. ఈ సినిమాకు మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది

Sudheer Babu: సుధీర్ బాబు సినిమాకు హాలీవుడ్ టచ్.. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా..
Sudheer Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 8:38 PM

యంగ్ హీరో సుధీర్ బాబు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే సుదీర్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ సినిమాకు మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. అయితే ఈ మూవీకి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.

‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న ‘జాన్ వీక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి” అని అన్నారు. ఇక సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఆప్డేట్స్ అందించనున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే